Akshay Kumar: ఈ ఏడాది మూడు మూవీస్.. అక్కీ సక్సెస్ ఫార్ములా ఏంటి?
కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే. ఇయర్ షెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటాడు. 55కు చేరువలో ఉన్నా యంగ్ హీరోలకన్నా స్పీడ్ గా వర్క్ చేస్తుంటాడు.

Akshay Kumar
Akshay Kumar: కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే. ఇయర్ షెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటాడు. 55కు చేరువలో ఉన్నా యంగ్ హీరోలకన్నా స్పీడ్ గా వర్క్ చేస్తుంటాడు. 2021లో సైతం హైస్పీడ్ చూపించిన బాలీవుడ్ ఖిలాడీ.. 2022 నాదే అంటున్నాడు. ఇంతకీ ఈ అక్షయ్ కుమార్ సక్సెస్ ఫార్ములా ఏంటో చూద్దాం.
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!
మంచి దూకుడు చూపిస్తున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. కెరీర్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. 2021 ఇయర్ ఎండ్ లో సూర్యవంశీతో 100కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి బాలీవుడ్ మూవీని పరుగులు పెట్టించాడు. యూనిక్ లవ్ స్టోరీ ఆతరంగి రే డైరెక్ట్ ఓటిటిలో వదిలి అక్కడా సూపర్ సక్సెస్ అయ్యాడు. లేటెస్ట్ గా క్రైమ్ కామెడి బచ్చన్ పాండే తో ఈ నెల 18న ఈ ఇయర్ బోణీ కొట్టబోతున్నాడు బాలీవుడ్ ఖిలాడి.
Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!
గద్దల కొండ గణేష్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న బచ్చన్ పాండే కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ కుమార్ తన సక్సెస్ ఫార్ములా రివీల్ చెశారు. ఏదైనా కలసి కట్టుగా పనిచేస్తేనే సాధ్యపడుతుందని.. లక్ కొంత పర్సెంటే ఉంటుందన్నారు అక్షయ్. తన కెరీర్ లో కూడా 14 నుంచి 16 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. అయినా తనెప్పుడూ ఒకేలా థింక్ చేస్తూ ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు అక్షయ్. ఇయర్ ప్లానింగ్ మొత్తం ముందే చేసుకుంటూ.. సినిమా సినిమాకీ క్యారెక్టర్ విషయంలో, స్టోరీ జానర్ విషయంలో వేరియషన్ చూసుకుంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటానని సక్సెస్ సీక్రెట్ బయట పెట్టాడు అక్షయ్ కుమార్.
Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!
బాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా,.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా రిలీజ్ లతో పాటు సక్సెస్ లతో రికార్డ్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్.. 2022లో అదిరిపోయే మార్కెట్ ని చేతిలో పెట్టుకున్నారు. అంతేకాదు 2 వేల కోట్ల సంపాదన తో హయ్యస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ గా ట్రెండ్ సెట్ చేయనున్నాడు. రాజ్ పుత్ కింగ్ పృధ్వీరాజ్ చౌహాన్ గా అక్షయ్ నటిస్తోన్న పృధ్వీరాజ్ మూవీ ఈ సంవత్సరం జూన్ 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సోషల్ కామెడీ రక్షాబంధన్ ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది. మరోవైపు రామ్ సేతు ప్రాజెక్ట్ ను రెడీ చేస్తూ.. మిషన్ సిండ్రెల్లా, ఓ మై గాడ్ 2 సినిమాలను లైన్ లో పెట్టాడు. వీటితో పాటు సూర్య ఆకాశమే నీ హద్దురా రీమేక్ కూడా చేతిలో ఉంది.