పౌరసత్వం నా వ్యక్తిగతం : అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం లేదా ? అతను కెనడియన్ ? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అక్షయ్ రెస్పాండ్ అయ్యాడు. తన పౌరసత్వంపై ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మే 03వ తేదీన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు అక్షయ్.
తనకు కెనడా పాస్ పోర్టు ఉందనే అంశాన్ని ఎన్నడూ దాచలేదని చెప్పుకొచ్చాడు ఈ హీరో. గడిచిన ఏడేళ్లుగా తాను కెనాడాకు అసలు వెళ్లనే లేదని స్పష్టం చేశాడు. భారత్‌పై ఉన్న ప్రేమను ఎవరి ముందు ప్రదర్శించుకోవాల్సినవసరం లేదని, అన్ని ట్యాక్స్‌లు కడుతున్నట్లు విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. తన పౌరసత్వం నా వ్యక్తిగతమని చెప్పాడు.
అక్షయ్ కుమార్ పౌరసత్వంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 29వ తేదీన నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో జరిగిన పోలింగ్ లో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ఓటు వేస్తే..అక్షయ్ కుమార్ మాత్రం ఓటు వేయలేదు. ఎందుకంటే.. భారతీయ పౌరసత్వమే లేదని..కెనడా పౌరసత్వం ఉందనే విమర్శలున్నాయి.
పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు PM నరేంద్రమోడీతో రాజకీయేతర ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని ట్విటర్‌లో మోడీ విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా పలువురికి ట్యాగ్ చేశారు మోడీ. ట్యాగ్ చేసిన ప్రముఖుల్లో అక్షయ్ కూడా ఉన్నారు. ఓటు ఎంతో శక్తిమంతమైంది..దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్ చెప్పుకొచ్చాడు. అయితే ఓటు మాత్రం వేయలేదు.
— Akshay Kumar (@akshaykumar) May 3, 2019