Ala Vaikunthapurramuloo : వాలంటైన్స్ డే స్పెషల్.. హిందీలో ‘అల..వైకుంఠపురములో’..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల..వైకుంఠపురములో’ నార్త్ ఆడియన్స్‌ని మెప్పించడానికి రెడీ అవుతోంది..

Ala Vaikunthapurramuloo
Ala Vaikunthapurramuloo: ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్‌కి చేరుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’ మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఒకనొక టైంలో హిందీ డిస్ట్రిబ్యూటర్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొంది. అసలు హిందీలో రిలీజ్ అవసరమా అని కూడా అనుకున్నారు కానీ ఎట్టకేలకు బన్నీ రంగంలోకి దిగి.. అక్కడి బయ్యర్‌తో మాట్లాడి నార్త్‌లో రిలీజ్ చేయించాడు.
Allu Arha : నాన్నకి అల్లు అర్హ స్వీటెస్ట్ వెల్‌కమ్..
హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. పార్ట్ 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ. 400 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘పుష్ప’ క్రేజ్‌తో ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో’ హిందీలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏఏ ఫిల్మ్స్, గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ వారు ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!
జనవరి 26వ తేదీతో పోస్టర్లు కూడా వదిలారు. కట్ చేస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ చేస్తుండడంతో ‘అల..వైకుంఠపురములో’ హిందీ వర్షన్ థియేటర్లలోకి రావడం లేదని..ఢించాక్ టీవీ (యూట్యూబ్ ఛానెల్) లో ఫిబ్రవరి 6నుండి ‘అల..వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ ప్రీమియర్ కానుందని తెలిపారు. ఇప్పుడు డేట్ మళ్లీ మారింది. వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 13 నుండి ‘అల..వైకుంఠపురములో’ హిందీ డబ్డ్ వర్షన్ అందుబాటులోకి రానుంది.
Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?