Shaheen Bhatt : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ అలియా భట్ అక్క.. ఫొటోలు వైరల్..
Alia Bhatt Sister Shaheen Bhatt Engagement: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అక్క, రచయిత షాహీన్ భట్ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. మహేష్ భట్, సోనీ రజాన్ల పెద్ద కుమార్తె షాహిన్ భట్ తాజాగా ఇషాన్ మెహ్రీ అనే జిమ్ ట్రైనర్ ని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉండగా నేడు నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ వేలికి ఉంగరాలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయం తెలిపింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





