CM Chandrababu Naidu : రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం.. పదేళ్లపాటు కౌలు, ఒక్కో కుటుంబానికి లక్షన్నర..
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం కానున్నారు. రెండో విడత భూ సమీకరణపై రైతులతో సమీక్షించనున్నారు.
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం అయ్యారు. రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులతో సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి 12గంటల వరకు ఈ సమావేశం జరిగింది. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10గ్రామాల రైతులు సీఎంతో సమావేశంలో పాల్గొన్నారు.
Also Read : Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబు నిరాహార దీక్ష.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు
రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని వెల్లడించారు. కుటుంబానికి రూ.1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి, ఏడాదికి రూ.3వేల చొప్పున కౌలు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని, రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదనే చట్టబద్దత కల్పించామని అన్నారు.
ఈ సమావేశంలో ఎండ్రాయి, పెదమద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 70 మంది రైతులు పాల్గొన్నారు. అయితే, తమకు అభివృద్ధి చేసిన స్థలాలను ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్థులు కోరారు. తమకు ఒకేచోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెద్దమద్దూరు, కర్లపూడి, వైకుంఠాపురం గ్రామాల రైతులు సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. అయితే, వీటిపై సీఎం చంద్రబాబు రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని, ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని,… pic.twitter.com/IasraKW89Y
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 17, 2026
