Alia-Ranbir Wedding: రణబీర్‌తో అలియా పెళ్లి ఎక్కడ.. అతిధులు ఎంత మందంటే?

రణబీర్ కపూర్-అలియా భట్ సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. ఈ నెలలో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు ముంబైలో టాక్ నడుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నారు.

Alia-Ranbir Wedding: రణబీర్‌తో అలియా పెళ్లి ఎక్కడ.. అతిధులు ఎంత మందంటే?

Alia Ranbir

Updated On : April 11, 2022 / 7:37 PM IST

Alia-Ranbir Wedding: రణబీర్ కపూర్-అలియా భట్ సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. ఈ నెలలో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు ముంబైలో టాక్ నడుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నారు ఈ లవ్లీ కపుల్. 2020 డిసెంబర్‌లో జరగాల్సిన రణ్ బీర్-అలియాల పెళ్లి.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అప్పుడో ఇప్పుడో అంటోన్న అసలైన పెళ్లి డేట్ మాత్రం ముందుకు పడటం లేదు. అయితే ఈ ఏప్రిల్‌ లోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంతో ఒక్కటవుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

ఇప్పటికే వెడ్డింగ్ డేట్ లాక్ చేసుకున్నఅలియా-రణ్ బీర్.. హై క్లాస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ లా కాకుండా వాళ్ల ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారనేది గాసిప్. అతికొద్ది మంది సన్నిహితుల నడుమ అతిత్వరలో రణ్ బీర్-అలియా విహాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెళ్లి గురించి తెగ చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది అతిథులు వస్తారు వంటి పలు విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఆలియాభట్‌ సోదరుడు రాహుల్‌ భట్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లికి కేవలం 28మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారని, వీరిలో ఎక్కువమంది కుటుంసభ్యులే అని రాహుల్‌ పేర్కొన్నారు. రాహుల్‌ ప్రకటన ప్రకటన ప్రకారం బయటి వారు ఎవరికీ ఆహ్వానం ఉండదని తెలుస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుక ముంబైలోని చెంబూర్‌లో కానీ, కపూర్ వంశానికి చెందిన తరతరాల నివాసం ఆర్కే హౌస్‌లో కానీ జరగనున్నట్లు తెలుస్తుంది.