‘అవతార్’ సీక్వెల్స్ అన్నీ వాయిదా.. ప్రకటించిన జేమ్స్ కామెరూన్..

  • Published By: sekhar ,Published On : July 24, 2020 / 06:50 PM IST
‘అవతార్’ సీక్వెల్స్ అన్నీ వాయిదా.. ప్రకటించిన జేమ్స్ కామెరూన్..

Updated On : July 24, 2020 / 6:57 PM IST

కరోనా మహమ్మారి ఇప్పటి సినిమాలపైనే కాదు.. భవిష్యత్తులో రాబోయే సినిమాలపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న ‘అవతార్’కు సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు జేమ్స్ కామెరూన్ భావించారు. అయితే కరోనా కారణంగా షూటింగ్‌లు జరుపుకునే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా విడుదలను ఓ ఏడాది వాయిదా వేశారు.

Avatar Sequels

ఈ మేరకు దర్శకుడు కామెరూన్ ఓ లేఖను విడుదల చేశారు. 2022 డిసెంబర్‌లో ‘అవతార్-2’ విడుదలవుతుందని తెలిపారు. అలాగే ‘అవతార్-3’ 2024 డిసెంబర్ 24, ‘అవతార్-4’ 2026 డిసెంబర్ 18, ‘అవతార్-5’ 2028 డిసెంబర్ 22న విడుదల చేస్తామని తెలిపారు.

James Cameron

అవతార్ సినిమాకు రియల్ షూటింగ్ కంటే, వర్చువల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా వర్చువల్ వర్క్ చేసే సీజీ కంపెనీలు అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా కారణంగా వర్క్ జరగడం లేదు. దీంతో అవతార్ సీక్వెల్స్‌ను వాయిదా వేయక తప్పడం లేదని కామెరూన్ పేర్కొన్నారు. డిస్నీ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Avatar Sequels