Pushpa 2: పుష్ప-2పై అటువంటి ప్రచారం చేస్తున్న వారికి మైత్రి మూవీ మేకర్స్, బన్నీ ఫ్యాన్స్ హెచ్చరిక

"అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ వాళ్లు చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి అభిమానులను దూరంగా ఉంచుతాం" అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ తమ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

Pushpa 2: పుష్ప-2పై అటువంటి ప్రచారం చేస్తున్న వారికి మైత్రి మూవీ మేకర్స్, బన్నీ ఫ్యాన్స్ హెచ్చరిక

Updated On : December 6, 2024 / 10:06 PM IST

పుష్ప-2లో లేని డైలాగులను ఉన్నట్లు కల్పించి ప్రచారం చేస్తున్న వారిని మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది. “ఊహాజనితమైన, సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం” అని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది.

మరోవైపు, పుష్ప 2 సినిమా హిట్ కొట్టిన వేళ కొందరు “అల్లు అర్జున్ ఫ్యాన్స్‌మి” అంటూ టీవీ, యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తుండడం పట్ల ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ స్పందించింది. అటువంటి వారితో తమకే సంబంధమూ లేదని స్పష్టం చేసింది.

“అల్లు అర్జున్ గారి తరఫున ఎవరైనా ఫాన్స్ అని చెప్పుకుని టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తే అది వారి వ్యక్తిగతం. అంతేగానీ, వారి భావజాలానికి అధికారికంగా మా మద్దతు ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయంగా ఏ నాయకుల మీదనైనా కొందరు అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి అభిమానులను దూరంగా ఉంచుతాం” అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ తమ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

“అల్లు అర్జున్‌రి అభిమానులు కొందరు టీవీ ఛానెళ్లలో లైవ్ డిబేట్‌లలో పాల్గొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ వ్యక్తులు మా అధికారిక అభిమానుల సంఘంతో ఏ విధంగానూ సంబంధం కలిగి లేరని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము” అని చెప్పింది. కాగా, పుష్ప 2 సినిమా భారీ హిట్‌ కొట్టడంతో దీనిపై మీడియా, సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కొందరు రాజకీయ కామెంట్లు కూడా చేస్తున్నారు.