Bachchalamalli ott streaming : సన్‌నెక్ట్స్‌లో అల్లరి నరేష్ కొత్త చిత్రం.. అస్సలు మిస్ కాకండి..
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రం బచ్చల మల్లి.

Allari Naresh Bachchalamalli movie streaming in SUN NXT ott
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రం బచ్చల మల్లి. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అల్లరి నరేశ్‌లోని మరో కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయిక. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. లోతైన భావోద్వేగ కథాంశం, ఆకర్షణీయ పాత్రలు, యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ప్రముఖ ఓటీటీ సన్‌నెక్ట్స్ లో ఈ చిత్రం నేటి (శుక్రవారం జనవరి 10) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయిన వారు ఎంచక్కా ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.
Rashmika Mandanna : రష్మికకు గాయం.. సినిమా షూటింగ్‌లకు బ్రేక్.. ఆందోళనలో అభిమానులు..
కథ..
బచ్చల మల్లి (అల్లరి నరేష్)కు వాళ్ల నాన్న అంటే ఎంతో ఇష్టం. మల్లి కాలేజీ చదివే సమయంలో అనుకోని పరిస్థితుల్లో మల్లి తండ్రి వాళ్లను వదిలివేసి వెళ్లిపోతాడు. దీంతో నాన్న మీద పగ పెంచుకుని మూర్ఖంగా పెరుగుతాడు మల్లి. ఎవరైనా సరే వాళ్ల నాన్న విషయం ఎత్తితో ఆ మూర్ఖత్వం ఇంకా పెరిగిపోతుంది. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో అతడి జీవితం మలుపు తిరుగుతుంది. అయితే.. మంచిగా మారిపోయిన మల్లి ఎందుకు మూర్ఖండా మారాడు? మల్లి, కావేరి ప్రేమ కథ ఏమైంది? తండ్రి తప్పుని క్షమించాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటకు ప్రశంసలు దక్కాయి. తండ్రిపై ప్రేమ, కోపం మధ్య నలిగిపోయే వ్యక్తిగా నరేష్ నటనట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం SUN NXTలో అందుబాటులో ఉంది. ఈ లవ్ కమ్ యాక్షన్ డ్రామాను అస్సలు మిస్ కాకండి.
The Wait is Over – Bachchalamalli the Superhit Action Drama is Streaming Now on SunNXT!! Watch Now!!#SunNXT #Action #Drama pic.twitter.com/XRnKVM6tSM
— SUN NXT (@sunnxt) January 10, 2025