Allu Aravind: నిజ జీవితంలో నటించలేని మనిషి బాలకృష్ణ -అల్లు అరవింద్

బాలకృష్ణ సినిమాల్లో గొప్ప నటుడేమో కానీ, నిజ జీవితంలో మాత్రం.. ఆయనకు కోపం వస్తే కోపం.. సంతోషం వస్తే సంతోషం..

Allu Aravind: నిజ జీవితంలో నటించలేని మనిషి బాలకృష్ణ -అల్లు అరవింద్

Aravind

Updated On : October 14, 2021 / 7:32 PM IST

Allu Aravind: బాలకృష్ణ సినిమాల్లో గొప్ప నటుడేమో కానీ, నిజ జీవితంలో మాత్రం.. ఆయనకు కోపం వస్తే కోపం.. సంతోషం వస్తే సంతోషం.. రియల్ ఎమోషన్‌ని దాచుకోరు అని అన్నారు అల్లు అరవింద్.

కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా ఉండే వ్యక్తియని అన్నారు అల్లు అరవింద్. బాలకృష్ణ గారు ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉందన్నారు అల్లు అర్జున్. ఒకరోజు ‘ఆహా’ టీమ్‌తో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ గారితో టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుంది’ అని అన్నాను. ప్రతీ ఒక్కరూ వెంటనే ఈలలు వేశారని, చేస్తే మంచి హిట్ అవుతుందని ప్రతీ ఒక్కరూ అన్నారని అన్నారు.

మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్‌ చేశానని, ఆయన ఓకే చేశారని అన్నారు. అలా ఈ షో పట్టాలెక్కిందని, ఆహాకు 1.5మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారని, ఈ ఏడాది చివరికి రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ లక్ష్యంగా టీమ్ పనిచేస్తుందని అన్నారు.