Allu Aravind : చిరంజీవి వెళ్లారు.. నేను వెళ్ళవసరం లేదు..

తాజాగా ఈ సమావేశం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ ఈ సమావేశం పై మాట్లాడుతూ.. ''ఈ భేటీతో టికెట్ల ధరల అంశంకు ఎండ్‌ కార్డ్‌ పడుతుందని ఆశిస్తున్నాం............

Allu Aravind :  చిరంజీవి వెళ్లారు.. నేను వెళ్ళవసరం లేదు..

Allu Aravind

Updated On : February 10, 2022 / 12:28 PM IST

Chiranjeevi :  సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యలకు ఎలాగైనా తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. చిరంజీవి ఇప్పటికే జగన్ ని కలిసి మాట్లాడి వచ్చారు. తాజాగా మరోసారి సినీ పెద్దలతో కలిసి జగన్ ని కలవడానికి వెళ్లారు చిరంజీవి. ఈ సారి చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలు, రాజమౌళి, కొరటాల శివ.. మరికొంతమంది పెద్దలు జగన్ ని కలవడానికి వెళ్తున్నారు. చిరంజీవి ముందుండి అందర్నీ నడిపిస్తున్నారు. సినీ ప్రముఖులందర్నీ ఇందులో భాగం చేసి సినీ పరిశ్రమకి మంచి జరగడానికి కృషి చేస్తున్నారు.

తాజాగా ఈ సమావేశం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ ఈ సమావేశం పై మాట్లాడుతూ.. ”ఈ భేటీతో టికెట్ల ధరల అంశంకు ఎండ్‌ కార్డ్‌ పడుతుందని ఆశిస్తున్నాం. ఇరు పక్షాలకు మంచి జరగుతుందని భావిస్తున్నాను. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు? అందుకే నేను వెళ్ళలేదు. ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

Samantha : సమంతతో క్రికెటర్ శ్రీశాంత్..

ఇక ఇప్పటికే టాలీవుడ్ పెద్దలంతా విజయవాడకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకోనున్నారు. ఆ తర్వాత జగన్ తో సినీ సమస్యలపై చర్చించి, అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు.