అల్లు అరవింద్‌ను ముద్దాడిన అర్హ – వైరల్ అవుతున్న క్యూట్ వీడియో..

అల్లు అర్హ, అల్లు అరవింద్‌ల క్యూట్ వీడియో వైరల్..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 12:51 PM IST
అల్లు అరవింద్‌ను ముద్దాడిన అర్హ – వైరల్ అవుతున్న క్యూట్ వీడియో..

Updated On : March 5, 2020 / 12:51 PM IST

అల్లు అర్హ, అల్లు అరవింద్‌ల క్యూట్ వీడియో వైరల్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతుల ముద్దుల తనయ అల్లు అర్హ అల్లరి మామూలుగా ఉండదు. డాడీ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా అంటే చేసుకోను అనడం.. సోషల్ మీడియా సెన్సేషన్ రాములో రాములా పాటలో దోశె స్టెప్ వేశావని బన్నీని కామెంట్ చేయడం.. మొన్నటికి మొన్న బన్నీ బే అనడం.. ఈ వీడియోలు చూసి అమ్మో అల్లువారి పిల్ల అల్లరి మామూలుగా లేదుగా అనుకున్నారంతా..

తాజాగా అర్హ ఓ సినిమా కార్యక్రమానికి అతిథిగా హాజరైంది. ఆ ప్రోగ్రామ్‌లో తాత అల్లు అరవింద్‌ను ప్రేమగా ముద్దాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్ హీరగా, అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ సంయుక్త నిర్మాణంలో బ‌న్నీ వాసు నిర్మాతగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజీస్’ అనే సినిమా తెరకెక్కనుంది. గురువారం (మార్చి 5) హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో నిఖిల్‌పై బేబి అల్లు అర్హ క్లాప్ నివ్వగా నిర్మాత బన్నీ వాసు కుమార్తె బేబి హన్విక కెమెరా స్విచ్చాన్ చేసింది. ఈ సందర్భంగా తాతా మనవరాలు అర్హ, అరవింద్ సరాదాగా ముద్దులాడుకుంటూ సందడి చేశారు. ‘ అర్హ.. మా ముహుర్తం ఫంక్షన్ చీఫ్‌గెస్ట్’ అంటూ నిఖిల్ షేర్ చేసిన వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.