Venkatesh – Allu Arjun : కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్, వెంకటేష్.. సినిమా వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నాము..

తాజాగా అల్లు అర్జున్, వెంకటేష్ తమ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Venkatesh – Allu Arjun : కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్, వెంకటేష్.. సినిమా వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నాము..

Allu Arjun and Venkatesh Reacts on Konda Surekha Comments

Updated On : October 3, 2024 / 10:21 AM IST

Venkatesh – Allu Arjun : కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ ఫైర్ అవుతుంది. ఇప్పటికే అనేక మంది సినీ సెలబ్రిటీలు స్పందించగా తాజాగా అల్లు అర్జున్, వెంకటేష్ తమ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Also Read : Konda Surekha – RGV : కొండా సురేఖ వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలి..

అల్లు అర్జున్ కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మరియు మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మరియు వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ప్రత్యేకించి మహిళల పట్ల గౌరవం ఉంచాలని నేను కోరుతున్నాను. సమాజంలో మనం గౌరవాన్ని పెంపొందించాలి అని అన్నారు.

ఇక వెంకటేష్ స్పందిస్తూ.. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయ మందుగుండులా వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం, కృషి మరియు మా క్రాఫ్ట్, మా వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో ఉన్నాము. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలకు నైతిక బాధ్యత ఉంది. వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవరికీ ఉపయోగపడదు. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం మరియు సానుభూతిని పాటించాలని నేను కోరుతున్నాను. మన చర్యలు, మాటలు విలువని కలిగి ఉంటాయి వాటని మంచి కోసం వాడాలి అని ట్వీట్ చేసారు.