18 Pages : ’18 పేజీస్’ లెక్క చూస్తా అంటున్న పుష్ప రాజ్..

నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా '18 పేజీస్'. 'కుమారి 21ఎఫ్' తెరకెక్కించిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా...

18 Pages : ’18 పేజీస్’ లెక్క చూస్తా అంటున్న పుష్ప రాజ్..

Allu Arjun as Chief Guest for 18 Pages

Updated On : December 17, 2022 / 7:33 AM IST

18 Pages : నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ’18 పేజీస్’. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కాబోతుంది. ‘కుమారి 21ఎఫ్’ తెరకెక్కించిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు.

18 Pages: 18 పేజీస్ సెన్సార్ పూర్తి.. నిఖిల్ సినిమాకి కూడానా..?

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 19న గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేసేలా.. నిఖిల్, కమెడియన్ అభినవ్ గౌతమ్‌తో కలిసి ఒక ప్రమోషనల్ వీడియో చేసి పోస్ట్ చేశాడు. హైదరాబాద్ జేఆర్‌సి కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్‌ని ఈరోజు విడుదల చేయనున్నారు.

గీతా ఆర్ట్స్-2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కార్తికేయ-2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న నిఖిల్ అండ్ అనుపమ ఈ మూవీతో కూడా విజయాన్ని అందుకుంటారా? అనేది చూడాలి.