Allu Arjun: “అల్లూరి” కోసం అల్లు అర్జున్..
యువ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలని ఎన్నుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా.. "విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయతి, నిజాయితీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు" అంటూ మరో వైవిధ్యమైన సినిమా "అల్లూరి"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా మూవీ మేకర్స్..

Allu Arjun as Chief Guest for Sri Vishnu New Movie Alluri
Allu Arjun: యువ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలని ఎన్నుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా.. “విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయతి, నిజాయితీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు” అంటూ మరో వైవిధ్యమైన సినిమా “అల్లూరి”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Alluri Movie: పోలీస్ డ్రెస్‌లో అదరగొట్టిన ప్రొడ్యూసైర్.. అల్లూరి వినూత్న ప్రమోషన్స్!
కన్నడ యువ దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని వారాలుగా సాంగ్స్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్స్ అంటూ సినిమా ప్రమోషన్‌లు నిర్వహిస్తున్న మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్”ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నారట.
ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది మరియు చీఫ్ గెస్ట్ కు సంబంధించిన వివరాలన్ని చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పోలీసు డ్రామాగా వస్తున్న ఈ మూవీ శ్రీవిష్ణుకి ‘కయదు లోహర్’ జంటగా నటిస్తుంది.