Allu Arjun : అల్లు అర్జున్‌కి ఇంకో ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఉందా? ఓన్లీ ఫ్యామిలీ కోసం.. లీక్ చేసిన ఉపాసన..
వేరే పేరుతోనో, లేదా ప్రైవేట్ మోడ్ లో పెట్టుకొని మన సెలబ్రిటీలు ఇంకో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా వాడతారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కూడా ఇంకో ప్రైవేట్ అకౌంట్ ఉందని తెలిసిపోయింది.

Allu Arjun Maintain Private Instagram Account only For Closed People Upasana Leak that Account
Allu Arjun : అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ అందరికి తెలిసిందే. తన గురించి, సినిమాల గురించి, ఫ్యామిలీ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాడు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ 25 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. అయితే చాలా మంది సెలబ్రిటీలకు ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయని టాక్ నడుస్తుంది.
అధికారిక అకౌంట్ ని సెలబ్రిటీలు మెయింటైన్ చేసినా ఆ సెలబ్రిటీ సోషల్ మీడియా టీం ఎక్కువగా చూస్తుంది. వాళ్ళే ఈ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ ని డీల్ చేస్తారు. సెలబ్రిటీస్ పబ్లిక్ లో కాస్త హుందాగా ఉండాలి కాబట్టి ఈ అధికారిక అకౌంట్స్ లో ఏది పడితే అది పోస్ట్ చేయలేరు, ఎవర్ని పడితే వాళ్ళని ఫాలో అవ్వలేరు, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ తోనే తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని వాడతారు. దీంతో కొంతమంది సెలబ్రిటీలు ప్రైవేట్ గా ఇంకో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు.
వేరే పేరుతోనో, లేదా ప్రైవేట్ మోడ్ లో పెట్టుకొని మన సెలబ్రిటీలు ఇంకో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా వాడతారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కూడా ఇంకో ప్రైవేట్ అకౌంట్ ఉందని తెలిసిపోయింది. ఉపాసన(Upasana) నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో విషెష్ చెప్తూ ఓ ఫొటో షేర్ చేసి అల్లు అర్జున్ అధికారిక అకౌంట్ తో పాటు అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ ని కూడా ట్యాగ్ చేసింది. ఇంకేముంది ఈ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వైరల్ గా మారింది.
Also Read : Vishwambhara : ఒక్క పోస్ట్‌తో ‘విశ్వంభర’ సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన డైరెక్టర్.. ధర్మ యుద్ధం మొదలు..
బన్నీ బాయ్ ప్రైవేట్ అనే పేరుతో అల్లు అర్జున్ ఈ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది కేవలం ఫ్యామిలీ, అతనికి క్లోజ్ అయిన వాళ్ళకే తెలుసు అని అర్ధమవుతుంది. ఈ అకౌంట్ బయోలో బన్నీ.. ఇది ప్రైవేట్ అకౌంట్, ఆలోచించకుండా ఏదైనా పోస్ట్ చేసాయడానికి అని రాసుకొచ్చారు. ఈ అకౌంట్ ప్రైవేట్ మోడ్ లో ఉండటంతో ఇందులోని పోస్ట్ లు ఎవరికీ కనపడవు. ఇప్పటికే ఈ అకౌంట్ లో బన్నీ 1300కి పైగా పోస్టులు పెట్టాడు. 300 మందికి పైగా బన్నీ ప్రైవేట్ అకౌంట్ ని ఫాలో అవుతుండగా బన్నీ 500 మందిని ఫాలో అవుతున్నాడు ఈ అకౌంట్ నుంచి. ఒరిజినల్ అకౌంట్ నుంచి కేవలం ఒక్క తన భార్యనే ఫాలో అవుతుండటం గమనార్హం.
ఒకవేళ మీరు ఈ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేయరు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ వైరల్ గా మారయింది. ఉపాసన ఈ విషయం లీక్ చేసి మంచి పని చేసిందని అభిమానులు అనుకుంటున్నారు. ఎంతమంది అభిమానులు ఈ అకౌంట్ కి రిక్వెస్ట్ లు పంపిస్తున్నారో.. దాంట్లో అల్లు అర్జున్ ఏం పోస్టులు చేస్తున్నాడో అల్లు అర్జున్ కే తెలియాలి మరి.