Allu Arjun – Trivikram : బన్నీ బర్త్ డే అప్డేట్.. త్రివిక్రమ్ తోనే నెక్స్ట్ సినిమా.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా?
నేడు బన్నీ నెక్స్ట్ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు.

Allu Arjun Next Cinema Announced in Trivikram Direction Poster Goes Viral
Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ పుష్ప(Puhspa) సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నాడు. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్, బోయపాటి.. ఇలా పలువురు దర్శకుల పేర్లు వినపడ్డాయి. బన్నీతో నెక్స్ట్ సినిమా చేయబోయేది వీళ్ళే అంటూ వార్తలు వచ్చాయి.
అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ నేడు బన్నీ నెక్స్ట్ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో చినబాబు నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఈ విషయాన్ని ప్రకటిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆల్రెడీ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – హారికా హాసిని కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధిచాయి. ఇప్పుడు ఈ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుంది. ఈ సినిమాతో త్రివిక్రమ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమా తీయబోతున్నట్టే.
బన్నీ – త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానులకు చాలా ఇష్టం. ఇప్పటికే తమ హీరోకి మూడు మంచి హిట్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబోలో సినిమా ప్రకటించడంతో సంతోషిస్తున్నారు అభిమానులు. ఇక పుష్పలో ఊర మాస్ గా కనిపిస్తే త్రివిక్రమ్ సినిమాలో మాత్రం మళ్ళీ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు.