Allu Arjun : చెప్పిన మాటని నిజం చేసి చూపించిన అల్లు అర్జున్.. దట్ ఇస్ ఐకాన్ స్టార్..
'అల వైకుంఠపురములో' మూవీ సమయంలో మాట ఇచ్చిన అల్లు అర్జున్.. తన తదుపరి సినిమా పుష్పతోనే చేసి చూపించి 'దట్ ఇస్ ఐకాన్ స్టార్' అనిపించుకున్నాడు.

Allu Arjun promised years ago and delivered now to get national award
Allu Arjun : సినీ పరిశ్రమలో నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం జాతీయ చలన చిత్ర అవార్డులు (National Film Awards). భారత్ ప్రభుత్వం ఇటీవలే ఈ అవార్డ్స్ ని ప్రకటించింది. తెలుగు సినిమా పరిశ్రమ ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా 10 పురస్కారాలు అందుకొని సంచలనం సృష్టించింది. ఇక వీటిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా టాలీవుడ్ చెంత చేరింది. ఈ పురస్కారం మొదలైన దగ్గర నుంచి తెలుగు నటులకు ఒక్కసారి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కలేదు.
Allu Arjun – Kriti Sanon : నేషనల్ అవార్డు విన్నర్స్ బన్నీ, కృతి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా..?
కమర్షియల్ కథల్లో నటించి, కమర్షియల్ యాక్షన్ హీరోగా నేషనల్ అవార్డు అందుకోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి చిత్రాలకు జాతీయ అవార్డు వంటి పురస్కారాల్లో పెద్ద గౌరవం కూడా ఉండేది కాదు. ఇక ఇదే విషయం పై అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ సమయంలో మాట్లాడాడు. “కమర్షియల్ సినిమా అనేది ప్రతి జోనర్ కలిగి ఉంటుంది. అక్కడ నటుడు ప్రతి ఎమోషన్ పండించాల్సి ఉంటుంది. అలాంటి కమర్షియల్ సినిమాకి నేను ఒక గౌరవం తీసుకోని వస్తాను” అంటూ చెప్పాడు. అలా చెప్పాడో లేదో ఇలా తదుపరి సినిమా పుష్పతోనే నేషనల్ అవార్డుని అందుకున్నాడు.
OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానికి అదిరే రిప్లై ఇచ్చిన నిర్మాత.. బర్త్ డేకి టాలీవుడ్..!
దీంతో అప్పటి వీడియోని అభిమానులు రీ షేర్ చేస్తూ.. “చెప్పిన మాటని నిజం చేసి చూపించిన అల్లు అర్జున్. దట్ ఇస్ ఐకాన్ స్టార్” అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి భవిషత్తులో అల్లు అర్జున్ కమర్షియల్ సినిమాకి ఇంకెంతటి గౌరవాన్ని తీసుకు వస్తాడో చూడాలి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. వచ్చే ఏడాది మార్చి 22న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మొదటి భాగానికి గాను అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ నేషనల్ అవార్డులు అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై నేషనల్ వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.