Pushpa 2 : పుష్ప 2 ప్రమోషన్స్ కు అన్ని కోట్ల ఖర్చా? బన్నీ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా? రాజమౌళి సినిమాని మించి..

మూవీ మ్యాటరంతా ఒక ఎత్తు అయితే పుష్ప-2 సినిమాకు బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్, పుష్ప ప్రమోషన్స్ కు పెట్టే ఖర్చు మీదే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Pushpa 2 : పుష్ప 2 ప్రమోషన్స్ కు అన్ని కోట్ల ఖర్చా? బన్నీ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా? రాజమౌళి సినిమాని మించి..

Allu Arjun

Updated On : November 16, 2024 / 9:43 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. నార్త్‌లో ప్రమోషన్స్ అదరగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న పుష్ప-2 సినిమా ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మూవీ యూనిట్ ఇస్తున్న లీకులు, రిలీజ్ చేస్తున్న పోస్టర్లు ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

అయితే మూవీ మ్యాటరంతా ఒక ఎత్తు అయితే పుష్ప-2 సినిమాకు బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్, పుష్ప ప్రమోషన్స్ కు పెట్టే ఖర్చు మీదే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లుఅర్జున్ దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో, సోషల్ మీడియాలో ఈ టాక్ బాగా అవిరళ అవుతుంది. షారూఖ్ ఖాన్, విజయ్, ప్రభాస్ తీసుకుంటున్న దాని కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు అల్లు అర్జున్ అని అంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారంటున్నారు. బాలీవుడ్ మీడియా కూడా ఇదే అంటుంది.

Also Read : Kanguva Collections : అదరగొట్టిన సూర్య ‘కంగువా’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే..?

ఐకాన్ స్టార్ 300 కోట్ల రెమ్యునరేషన్‌కు ఎదిగాడంటే ఇక ముందు బన్నీతో సినిమా అంటే నిర్మాతలు పెద్ద బడ్జెట్నే పెట్టుకోవాలంటున్నారు. మరోవైపు పుష్ప-2 సినిమా ప్రమోషన్స్‌కు దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్. సాధారణంగా రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ కు కోట్లు ఖర్చుపెట్టి చేయిస్తాడు. RRR సినిమాకు భారీగా కోట్లు ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళిని మించి పుష్ప 2 ప్రమోషన్స్ కు ఖర్చు చేస్తున్నారని టాక్. అయితే నిర్మాతలు ఈ ఖర్చు చేయడం లేదట. చాలా కార్పోరేట్ సంస్థలు మూవీ ప్రమోషన్స్ లో భాగం కానున్నాయని సమాచారం.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం పుష్ప-2లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రేపు నవంబర్ 17న పాట్నాలో భారీ వేదికను నిర్మించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఓ రేంజ్‌లో నిర్వహించేందుకు రెడీ అయింది మూవీ యూనిట్. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.