Kanguva Collections : అదరగొట్టిన సూర్య ‘కంగువా’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే..?
కంగువా సినిమా ప్రేక్షకులను మెప్పించి దూసుకెళ్తుంది.

Suriya Kanguva Movie Two Days World Wide Collections Details Here
Kanguva Collections : తమిళ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే ‘కంగువ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ కథతో పాటు ప్రస్తుత కాలానికి చెందిన కథ కలుపుతూ పునర్జన్మ నేపథ్యంలో కంగువ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read : Kasthuri : చెన్నైలో పరారయి ఏపీలో దొరికిన నటి కస్తూరి.. పోలీసుల అదుపులో కస్తూరి..
కంగువా సినిమా ప్రేక్షకులను మెప్పించి దూసుకెళ్తుంది. కొన్ని చోట్ల మాత్రం మిక్స్‌డ్ టాక్ వినిపిస్తుంది. అయితే కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. కంగువా సినిమా మొదటి రోజు 58 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండు రోజుల్లో 89.32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేడు ఆదివారం కాబట్టి రేపటికి 100 కోట్లు ఈజీగా దాటేస్తుందని తెలుస్తుంది.
ఇక కంగువా సినిమా క్లైమాక్స్ లో ఓ స్పెషల్ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసారు. మరి పార్ట్ 2 ఎప్పుడొస్తుందో చూడాలి.