అల్లు అర్హకు బన్నీ సర్‌ప్రైజ్!

  • Published By: sekhar ,Published On : November 21, 2020 / 04:11 PM IST
అల్లు అర్హకు బన్నీ సర్‌ప్రైజ్!

Updated On : November 21, 2020 / 4:40 PM IST

Allu Arha: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేమా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హకు బర్త్‌డే నేడు (నవంబర్‌ 21) ఈ సందర్భంగా తన గారాలపట్టికు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు బన్నీ.Bunnyముందుగా చిన్న గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ స్టార్ట్‌ చేసి తర్వాత ఏకంగా అర్హకు ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. అలాగే ఆ గుర్రంపై అర్హకు కాసేపు సరదాగా తిప్పారు. తండ్రి ఇచ్చిన సర్‌‌ప్రైజ్‌ లతో చిన్నారి అర్హ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.



‘‘అపరిమితమైన క్యూట్‌నెస్‌తో నాకు అమితానందానిస్తున్న అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా చిన్నదేవతకు ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.



https://10tv.in/allu-arhas-anjali-anjali-video-song/
అలాగే పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్‌ మూవీ ‘అంజలి’ సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాటను రీ క్రియేట్ చేసి.. వీడియో సాంగ్ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు.ఈ పాటలో అల్లు అర్హ క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, ముద్దుముద్దులొలికే చిరునవ్వుతో ఆకట్టుకుంది. అర్హతో పాటు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి, డా.వెంకటేశ్వరరావులతో పాటు అల్లు అర్జున్‌ కూడా నటించడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)