Allu Ayaan : అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా అల్లు అయాన్..
అల్లు అయాన్ తన సరదా చేష్టలతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు.

Allu Ayaan as Guest for Allu Sirish Buddy Movie Pre Release event
Allu Ayaan : అల్లు అర్జున్ కొడుకుగా అల్లు అయాన్ అందరికి పరిచయమే. అయితే అల్లు అయాన్ చిన్నప్పట్నుంచి తన చిలిపి పనులతో, తన సరదా చేష్టలతో వైరల్ అవుతూనే ఉన్నాడు. అల్లు ఫ్యామిలీ నుంచి ఫొటోలు, వీడియోలు వస్తే ఫ్యాన్స్, నెటిజన్లు అందరూ అల్లు అయాన్ కోసమే వెతుకుతారు. అల్లు అయాన్ కొత్త ఫోటో, వీడియో వచ్చిందంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.
అల్లు అయాన్ ఇలా సరదా చేష్టలతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. తాజాగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కన బడ్డీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అల్లు శిరీష్ మాట్లాడుతుంటే ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు అల్లు అయాన్ అని అరిచారు. దీంతో అల్లు శిరీష్.. అల్లు అయాన్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొస్తాను అని మాట ఇచ్చాడు. బాబాయ్ గా అల్లు శిరీష్ కి అయాన్ కి మంచి బంధమే ఉంది.
Also Read : Pawan Kalyan : వారాహి దీక్షలో పవన్ కళ్యాణ్ పూజలు.. మంగళగిరి జనసేన కార్యాలయంలోనే దీక్ష..
అలాగే అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే మెంటలెక్కిపొతుంది అని సరదాగా అన్నారు శిరీష్. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా బడ్డీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం అల్లు అయాన్ గెస్ట్ గా వస్తాడని అభిమానులు, నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఆ ఈవెంట్లో అయాన్ ఇంకెన్ని సరదా చేష్టలు చేసి నవ్విస్తాడో అని ఎదురుచూస్తున్నారు.
#AlluSirish about #Ayaan craze at #Buddy trailer launch event pic.twitter.com/2eKe8tnnmu
— Suresh PRO (@SureshPRO_) June 25, 2024