Allu Ayaan : ‘ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు’.. బన్నీకి అయాన్ ఎమోషనల్ లెటర్.. ఎంత చక్కగా రాశాడో చూడండి..
పుష్ప సినిమా విడుదల సందర్బంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ తన తండ్రికి ఒక ఎమోషనల్ లెటర్ రాసాడు.

Allu Ayaan Emotional note to Allu Arjun
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి నుండి స్టార్ట్ అయ్యాయి. మొదటి షో నుండే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టికెట్ రేట్స్ పెంచినప్పటికీ తగ్గేదే లే అన్నట్టు ఆడియన్స్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. మొదటి షో టికెట్స్ కోసం క్యూ కట్టారు.
Also Read : Pushpa 2 : ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న పుష్ప 2.. ఎందులో అంటే..?
అయితే పుష్ప సినిమా విడుదల సందర్బంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ తన తండ్రికి ఒక ఎమోషనల్ లెటర్ రాసాడు. పుష్ప 2 కోసం తన తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆ లెటర్ లో రాయడంతో ఎమోషనల్ అయ్యాడు బన్నీ. తన సోషల్ మీడియా వేదికగా ఆ లెటర్ ఫోటో షేర్ చేశారు. ఇక అందులో “డియర్ నాన్నా నేను మీ గురించి ఎంత గర్వపడుతున్నానో, మీ విజయం, మీ హార్డ్ వర్క్ గురించి చెప్పడానికి నేను ఈ లెటర్ రాస్తున్నాను. నేను నిన్ను నంబర్ 1లో చూసినప్పుడు, నేను ఈ ప్రపంచం మొదటి స్థానంలో ఉన్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు. నీకు, మీ టీమ్ కి ఆల్ ది బెస్ట్. పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉన్నా నువ్వే నా రియల్ హీరో.. నీకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు.. వైల్డ్ ఫైర్. ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు, ఐడల్ నాన్నకి ప్రేమతో రాస్తున్న లేఖ ఇది” అంటూ తెలిపాడు అయాన్.
View this post on Instagram
తన కొడుకు రాసిన లేఖను చూసి బన్నీ.. ” ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో ఇదే అతిపెద్ద విజయమని” అయాన్ రాసిన ఈ లెటర్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం అయాన్ రాసిన ఈ లెటర్ నెట్టింట వైరల్ అవుతుంది.