Allu Arjun : అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు క్యూట్‌ దెయ్యాలు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు క్యూట్‌ దెయ్యాలు హల్చల్ చేశాయి. అవును మీరు చూస్తున్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తెలిపారు. ఈ రెండు దెయ్యాలను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Allu Arjun : అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు క్యూట్‌ దెయ్యాలు.

Allu Arjun

Updated On : July 19, 2021 / 11:32 AM IST

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు క్యూట్‌ దెయ్యాలు హల్చల్ చేశాయి. అవును మీరు చూస్తున్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తెలిపారు. ఈ రెండు దెయ్యాలను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ రెండు దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్ కొడుకు, కూతురు. తెల్లటి బట్టతో ముసుగు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ హంగామా చేశారు. కాసేపు స్టెప్పులు చేశారు. నల్లటి కళ్లద్దాలు తగిలించి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక వీరు చేసిన అల్లరి వీడియోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో 2 లక్షల లైక్.. మిలియన్ కి చేరువలో వ్యూస్ తో దూసుకుపోతుంది.

సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే అర్జున్.. వీలు కుదిరినప్పుడల్లా తన పిల్లలతో టైంపాస్ చేస్తుంటారు. పిల్లతో ఆటలాడుతూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)