Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వ‌ల్ల ఇక కుద‌ర‌లేదు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వ‌ల్ల ఇక కుద‌ర‌లేదు

Allu Sirish-Aamir Khan

Allu Sirish- Aamir Khan : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు కెరీర్‌కు సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేసుకునే వాడు. అయితే.. ఏమైందో తెలీదు గానీ గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఎప్పుడో ఒక సారి త‌న సినిమాకు సంబంధించిన విష‌యాల‌నే పోస్ట్ చేస్తున్నాడు.

అయితే.. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌ (Aamir Khan) తో క‌లిసి దిగిన ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘అమీర్‌ఖాన్‌ను మ‌రోసారి క‌లుసుకున్నాను. లెజెండ్ ద‌గ్గ‌ర నుంచి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఆయ‌న‌తో చేసిన ప్ర‌యాణంలో ఆయ‌న గురించి ఎన్నో విష‌యాల‌ను నేను చెప్ప‌గ‌ల‌ను. అయితే.. వాటిని మ‌రొక రోజు మీతో పంచుకుంటా. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫోటోను పోస్ట్ చేయ‌కుండా ఉండేందుకు ఎంతో ప్ర‌య‌త్నించా.. అయితే నాలోని అభిమాని ఎక్కువ రోజులు మీతో పంచుకోకుండా ఉండ‌లేక‌పోయాడు. అందుక‌నే పోస్ట్ చేశా.’ అని శిరీష్ రాసుకొచ్చాడు. కాగా.. వీరిద్ద‌రు ప్ర‌ముఖ నిర్మాత మ‌ధు మంతెన, ర‌చ‌యిత మ‌రియు యోగా టీచ‌ర్ ఐరా త్రివేది పెళ్లిలో క‌లుసుకున్నారు.

Vijay : లియో సినిమాలో అలా చేసినందుకు.. తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు..

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)

Adipurush : 10 రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు..!

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. గ‌తేడాది ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంతో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు శిరీష్‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న సినిమా ‘బడ్డీ’. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కే ఇ జ్ఞానవేల్ రాజా, ఆధాన జ్ఞానవేల్ రాజా లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు శిరీష్ పుట్టిన రోజున ఈ సినిమాకి సంబంధించిన యాక్ష‌న్ గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.