Amit Shah : ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్ర యూనిట్‌కి అమిత్ షా స్పెషల్ లంచ్..

అమిత్ షా ఈ ఫోటోలని షేర్ చేసి.. ''ఈ రోజు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్ర బృందంతో సమావేశమయ్యాను. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సత్యానికి ధైర్యమైన ప్రాతినిధ్యం వహించింది. ఇలాంటి చారిత్రక...........

Amit Shah : ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్ర యూనిట్‌కి అమిత్ షా స్పెషల్ లంచ్..

Amith Shah

Updated On : March 17, 2022 / 11:44 AM IST

The Kashmir Files :  బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా ఇటీవల మార్చ్ 11న రిలీజై అయి అంచనాలకి మించి భారీ విజయం సాధిస్తుంది. కశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. నరేంద్ర మోడీతో సహా దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు, ప్రేక్షకులు ఈ సినిమాని అభినందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ కి దేశ హోం మినిస్టర్ అమిత్ షా స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు.

Amit Shah

ఇటీవల అమిత్ షా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి ఆ చిత్ర యూనిట్ ని తన నివాసానికి పిలిపించి మరీ అభినందించారు. అంతే కాకుండా వారికి స్పెషల్ లంచ్ ని ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోలని తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

The Kashmir Files : తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ మూవీని టాక్స్ ఫ్రీ చేయాలి.. రాజాసింగ్ కామెంట్స్..

 

Amit Shah Lunch

అమిత్ షా ఈ ఫోటోలని షేర్ చేసి.. ”ఈ రోజు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్ర బృందంతో సమావేశమయ్యాను. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సత్యానికి ధైర్యమైన ప్రాతినిధ్యం వహించింది. ఇలాంటి చారిత్రక తప్పిదాలు పునరావృతం కాకుండా సమాజానికి, దేశానికి అవగాహన కల్పించేందుకు ఈ సినిమా కృషి చేస్తుంది. ఈ సినిమా చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు. కశ్మీరీ పండిట్ల త్యాగం, భరించలేని బాధ మరియు పోరాటం యొక్క నిజాలు ఈ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తం దృష్టికి వచ్చింది, ఇది చాలా అభినందనీయమైన ప్రయత్నం” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.