కాంచన హిందీ రీమేక్ : హిజ్రా పాత్రలో అమితాబ్!

కాంచన హిందీ రీమేక్ 'లక్ష్మీబాంబ్' లో హిజ్రా పాత్రలో నటించనున్న అమితాబ్ బచ్చన్..

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 11:53 AM IST
కాంచన హిందీ రీమేక్ : హిజ్రా పాత్రలో అమితాబ్!

Updated On : April 29, 2019 / 11:53 AM IST

కాంచన హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ లో హిజ్రా పాత్రలో నటించనున్న అమితాబ్ బచ్చన్..

బిగ్ బి అమితాబ్, తన 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి, ఆడియన్స్‌ని మెప్పించారు. ఇన్నేళ్ళ కెరీర్‌లో అమితాబ్ ఇప్పటి వరకూ చెయ్యని క్యారెక్టర్ ఒకటి ఇప్పుడు చెయ్యబోతున్నారు. అది హిజ్రా పాత్ర కావడం విశేషం. పాపులర్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంచన సిరీస్‌తో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముని, కాంచన, గంగ, కాంచన-3 (ముని4) సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు. ఏప్రిల్ 19న రిలీజ్ అయిన కాంచన-3 రూ.100 కోట్ల వసూళ్ళు సాధించింది. ఇప్పుడు కాంచన మూవీ బాలీవుడ్‌లో తెరకెక్కనుంది. లారెన్స్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. ‘లక్ష్మీబాంబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయ్యింది. కాంచన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హిజ్రా క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం.. తమిళ్‌లో శరత్ కుమార్ ఈ పాత్రని అద్భుతంగా పోషించాడు. కన్నడలో సాయికుమార్ చేసాడు. మరి హిందీలో ఈ రోల్ ఎవరు చేస్తారు అని అంటే, బిగ్ బి అమితాబ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. ఆయన ఈ రోల్ చేస్తున్నారు అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. త్వరలో అమితాబ్ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. కాంచన మూవీని బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి రూపొందించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌పి, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి.