Amma Rajashekar : కొడుకును హీరోగా పరిచయం చేస్తూ.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన అమ్మ రాజశేఖర్.. రిలీజ్ ఎప్పుడంటే..
డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా తన కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ అనే సినిమా తీసాడు.

Amma Rajashekar Introducing his son Amma Raagin Raj Thala Movie Releasing
Amma Rajashekar : స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా తన కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ అనే సినిమా తీసాడు. దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘తల’. అంకిత నస్కర్ హీరోయిన్ గా చేస్తుండగా రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజాగా నిన్న తల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శకులు సముద్ర, నటుడు శివారెడ్డి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తల సినిమాతో మునుపటి అమ్మ రాజశేఖర్ ను చూస్తారు. కథ నాకు బాగా నచ్చింది. చెప్పిన దానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి అమ్మ రాజశేఖర్ లో కనిపించింది. రాగిన్ రాజ్ భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు అని అన్నారు.
Also Read : Pawan Kalyan – Akira Nandan : మాస్ లుక్‌లో అకిరా నందన్.. తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి అకిరా.. ఫోటోలు వైరల్..
నటి ఎస్తేర్ నోరాన్హా మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ కు ఈ సినిమా మంచి డెబ్యూ అవుతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఇతరుల ఫేమ్ ను వాడుకోవట్లేదు. అందరికీ గుర్తింపు వచ్చే పాత్రలు రాసుకున్నారు. నా పాత్ర నాకే ఛాలెంజింగ్ గా అనిపించింది. తల నాకు మంచి జాబ్ శాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అని తెలిపింది.
హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. తల కథ మా నాన్న నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. కొత్త నటుడిగా మీ ముందుకు వస్తున్నాను, మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు అన్ని నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి. 18 ఏళ్ళ అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది ఈ కథ మెయిన్ ప్లాట్ ఈ సినిమాతో మా నాన్న అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు అని అన్నాడు.
డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలలుగా చాలా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ చూశాను. అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అని అడిగిన వాళ్లందరికీ ఈ సినిమాతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించండి. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని తెలిపారు.