వర్మకు సెన్సార్ క్లియరెన్స్ : ARKB రేపే విడుదల

రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్.. రేపే విడుదల..

  • Published By: sekhar ,Published On : December 11, 2019 / 01:58 PM IST
వర్మకు సెన్సార్ క్లియరెన్స్ : ARKB రేపే విడుదల

Updated On : December 11, 2019 / 1:58 PM IST

రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్.. రేపే విడుదల..

కాంట్రవర్సీకింగ్ రామ్ గోపాల్ వర్మ పట్టు పట్టాడంటే ఓ పట్టాన వదలడు. అవతలి వాడికి ఊపిరి ఆడనివ్వడు. ఆర్జీవీ ఏ ముహూర్తాన ఏపీ రాజకీయాలపై సినిమా మొదలు పెట్టాడో కానీ.. సినిమా టైటిల్ దగ్గరినుంచి వివాదాల మీద వివాదాలు.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. డిసెంబర్ 12న విడుదల కావలసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంపై పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు చిత్ర యూనిట్.. సెన్సార్ బోర్డు, చిత్ర యూనిట్ సభ్యులు పిటీషన్‌పై కౌంటర్ ధాఖలు చేశారు.

Image

ఎగ్జామినేషన్ కమిటీ చిత్రాన్ని మత పరమైన అంశాలతో పాటు, ఒక వర్గాన్ని కించపరిచే లా ఉందని, శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం అప్రూల్ చేయలేమని కౌంటర్ పేర్కొన్నారని తేల్చి చెప్పింది హైకోర్టు. ఇక సినిమా విడుదల కష్టమే అనుకుంటుండగా.. చివరి నిమిషంలో ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ లభించింది..

Image

సినిమా చూసి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో వర్మ ఊపిరి పీల్చుకున్నాడు. సినిమా నిడివి 132 నిమిషాలు.  సెన్సార్ సర్టిఫికెట్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. తన స్టైల్‌లో చెలరేగిపోయాడు వర్మ. రేపే విడుదల పోస్టర్స్ పోస్ట్ చేస్తూ తన సైడ్ నుంచి ప్రమోషన్ చేస్తున్నాడు. రేపు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.