Anasuya : మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతున్న రంగమ్మత్త

తాజాగా అనసూయకి మలయాళం సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న 'భీష్మ పర్వం' అనే సినిమాలో అనసూయ....

Anasuya : మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతున్న రంగమ్మత్త

Anasuya

Updated On : December 31, 2021 / 8:35 PM IST

Anasuya :   జబర్దస్త్ షోలో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై తన మాటలతోనే కాక తన అందచందాలతో జనాల్ని ఆకట్టుకుంది. ఒక పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క వెండితెర పై వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో అనసూయకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది అనసూయ. సుకుమార్ డైరెక్షన్ లో రాంచరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాత్రకి చాలా పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అనసూయకి సినిమా అవకాశాలు ఇంకా పెరిగాయి.

ఇటీవల మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లోనే ‘పుష్ప’ సినిమాలో ద్రాక్షాయని క్యారెక్టర్ లో అదరగొట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వడంతో వేరే భాషల్లో కూడా అనసూయ క్యారెక్టర్ కి మంచి పేరే వచ్చింది. దీంతో అనసూయకి వేరే సినీ పరిశ్రమల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అనసూయకి మలయాళం సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు.

Sunil : రాజా రవీంద్రతో నాకు ఎలాంటి గొడవ అవ్వలేదు.. కాని.. : సునీల్

మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ అనే సినిమాలో అనసూయ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఇందులో అనసూయ అలిసా అనే పాత్రలో కనపడబోతుంది. ఈ పోస్టర్ లో చాలా సాధారణంగా ఉండే ఒక గృహిణి పాత్రగా కనిపిస్తుంది. ఈ సినిమాతో మలయాళంలో కూడా మంచి పేరు సంపాదించి వరుస ఛాన్సులు కొట్టేయాలని చూస్తుంది అనసూయ. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మలయాళంలో ఎంట్రీ ఇవ్వడం, అది కూడా మమ్ముట్టి సర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే మంచి ఎంట్రీ దొరకదేమో అని పోస్ట్ చేసింది అనసూయ.