Anasuya : అనసూయని అంతగా హర్ట్ చేసింది ఎవరో..

 యాంకర్ గా బిజీగా ఉండే అనసూయ జబర్దస్త్ వదిలేసి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది. కానీ సినిమాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. మెయిన్ లీడ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా, పెద్ద సినిమాలు ఏ ఆఫర్ వచ్చినా చేసేస్తోంది.................

Anasuya : అనసూయని అంతగా హర్ట్ చేసింది ఎవరో..

Anasuya Instagram story goes viral

Updated On : December 24, 2022 / 10:42 AM IST

Anasuya :  యాంకర్ గా బిజీగా ఉండే అనసూయ జబర్దస్త్ వదిలేసి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది. కానీ సినిమాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. మెయిన్ లీడ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా, పెద్ద సినిమాలు ఏ ఆఫర్ వచ్చినా చేసేస్తోంది. సినిమాలు, షాప్ ఓపెనింగ్స్ తో బిజీబిజీగా ఉంది అనసూయ.

ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అందరికి తెలిసిందే. ఓ వైపు తన ఫోటోషూట్స్ తో రెగ్యులర్ గా హీట్ పెంచుతూ మరోవైపు నెటిజన్లతో వివాదాలు పెట్టుకుంటూ, అక్కర్లేని వాటికి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ లో ఉండటానికి చూస్తుంది అనసూయ. తాజాగా అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్ ని షేర్ చేసింది.

Kaikala Satyanarayana : అధికార లాంఛనాలతో కైకాల అంతక్రియలు..

ఆ కొటేషన్ లో ”నేను చాలా దారుణంగా దెబ్బతిన్నాను. నన్ను హర్ట్ చేసినట్టు నేనెవర్ని హర్ట్ చేయలేదు” అని పెట్టింది. దీంతో ఇది వైరల్ గా మారింది. అనసూయ అంతగా ఏ విషయంలో దెబ్బతింది, అనసూయని ఎవరు అంతగా హర్ట్ చేశారో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అనసూయ. మరి ఈ భామని అంతగా హర్ట్ చేసింది ఎవరో అనసూయకే తెలియాలి.