Anasuya : అనసూయ పోస్ట్.. మళ్ళీ ఆంటీ అంటూ మొదలుపెట్టిన నెటిజన్లు..
మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ..

Anasuya was once again trolled by netizens with the term aunty due to her recent post
Anasuya : కొన్ని రోజుల క్రితం అనసూయ ఆంటీ వివాదం ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో కొందరు అనసూయని ఆంటీ అన్నారని పోలీసు కేసు పెడతానంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది అనసూయ. దీంతో కొన్ని రోజులు ఆంటీ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండేలా చేశారు నెటిజన్లు. కొంతమంది మీద ఆంటీ అంటున్నారని సైబర్ కంట్రోల్ లో కూడా కంప్లైంట్ చేసింది అనసూయ. కొన్ని రోజులు ఈ ఆంటీ వివాదం హడావిడి అయి ఆ తర్వాత సద్దుమణిగింది. అయినా ఇప్పటికి కూడా పలువురు సోషల్ మీడియాలో పెళ్లయి పిల్లలు ఉండి, అంత ఏజ్ ఉన్న అనసూయని ఆంటీ అనే అంటారు అంటూ కామెంట్స్ చేస్తూ ఆంటీ అనే అంటూ ఉంటారు.
ఇటీవల సోషల్ మీడియాలో ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు, ట్రోలింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు తీసుకొని చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ క్రైమ్ DCP స్నేహ మెహ్రా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ కవరేజ్ ని అనసూయ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇండైరెక్ట్ గా తనని ట్రోల్ చేసేవాళ్ళని హెచ్చరించింది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023
Mogilayya : మంచానపడ్డ ‘బలగం’ సింగర్.. అండగా నిలిచిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
అయితే ఇది అనసూయకు రివర్స్ అయింది. ఈ పోస్ట్ పెట్టడంతో మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ అనేకమంది నెటిజన్లు అనసూయ పోస్టుకి రకరకాల కామెంట్స్ ఇస్తున్నారు. ఇక కొంతమంది మరోసారి ఆంటీ, ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆంటీ అంటే అసభ్యకరంగా తిట్టినట్టా అని ప్రశ్నిస్తున్నారు. మరోసారి అనసూయ, ఆంటీ పదాలని ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. సైలెంట్ గా ఉన్న వాళ్ళని పోస్ట్ పెట్టి మరీ మళ్ళీ ఆంటీ అనిపించుకుంటుంది అని ఇంకొంతమంది అనసూయను కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram