Pradeep Machiraju: మళ్లీ కలిసేవరకూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా- యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్ కరోనా కారణంగా మూడు వారాల క్రితం చనిపోయిన తన తండ్రిని మిస్ అవుతూ పోస్టు చేశాడు. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తండ్రిని....

Pradeep Machiraju: మళ్లీ కలిసేవరకూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా- యాంకర్ ప్రదీప్

Pradeep Machiraju

Updated On : May 24, 2021 / 2:51 PM IST

Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ కరోనా కారణంగా మూడు వారాల క్రితం చనిపోయిన తన తండ్రిని మిస్ అవుతూ పోస్టు చేశాడు. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తండ్రిని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని.. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చారు.



తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన పోస్టు చేయగా ప్రముఖ యాంకర్లు అతనికి ధైర్యమిచ్చేలా మాకెంట్లు చేస్తున్నారు.



‘ఐ లవ్ యు నాన్న.

ఇవాళ ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే.
జీవితాన్ని చిరున‌వ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు.
మీకు గౌరవం క‌లిగించేలా న‌డుచుకుంటాను.



నా కోసం ఎప్పుడూ ఉంటారని తెలుసు. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు బాధ‌తో ముక్క‌లైన మ‌న‌స్సును ప్రేమ‌తో బాగు చేశారు.
మీ ధైర్యం నాకు స్ఫూర్తినిచ్చింది. నా కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేసింది. మీరు నాకెప్ప‌టికీ స్పెష‌ల్. జీవితంలో నేను ఎలాం ఉన్నా మిమ్మల్ని గుర్తుంచుకుంటాను.

మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చుట్టూ ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా.



మళ్లీ కలిసే దాకా మిస్ అవుతూనే ఉంటా..
ఐ మిస్‌ యూ నాన్న’ అని పోస్టు చేశారు ప్రదీప్.