Big Boss 5 Telugu: యాంకర్ రవి ఎంట్రీ.. సీక్రెట్ చెప్పేసిన లాస్య!

ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందా.. ఉండదా అనే అనుమానాల నుండి.. షో ఎప్పుడు మొదలవుతుందనే చర్చకు వచ్చేశారు ప్రేక్షకులు. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలు కానుందని ప్రచారం జరుగుతుండగా ఇప్పటికే స్టార్ మా ఈ సీజన్ లోగోను కూడా విడుదల చేసేసింది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ప్రోమో కూడా షూట్ జరిగిపోగా కింగ్ నాగార్జున మరోసారి బుల్లితెర మీదకి ఎంట్రీ మాత్రమే మిగిలిఉంది.

Big Boss 5 Telugu: యాంకర్ రవి ఎంట్రీ.. సీక్రెట్ చెప్పేసిన లాస్య!

Big Boss 5 Telugu

Updated On : August 8, 2021 / 7:58 PM IST

Big Boss 5 Telugu: ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందా.. ఉండదా అనే అనుమానాల నుండి.. షో ఎప్పుడు మొదలవుతుందనే చర్చకు వచ్చేశారు ప్రేక్షకులు. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలు కానుందని ప్రచారం జరుగుతుండగా ఇప్పటికే స్టార్ మా ఈ సీజన్ లోగోను కూడా విడుదల చేసేసింది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ప్రోమో కూడా షూట్ జరిగిపోగా కింగ్ నాగార్జున మరోసారి బుల్లితెర మీదకి ఎంట్రీ మాత్రమే మిగిలిఉంది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్లు వీరే అంటూ ఓ జాబితా కూడా ముమ్మర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సీజన్ కంటెస్టెంట్ల జాబితాలో యాంకర్ రవి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో నిర్వాహకులు కానీ.. మా యాజమాన్యం కానీ ఇప్పటి వరకు అధికారికంగా కంటెస్టెంట్లు వీరే అని ప్రకటించలేదు కానీ ఎవరికి వారు ఊహాగానాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అయితే, యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ ఎంట్రీపై లాస్య సీక్రెట్ ఓపెన్ అయింది. యాంకర్ రవి, లాస్య హిట్ పెయిర్ అన్న సంగతి తెలిసిందే. చాలా సన్నిహితులైన ఈ ఇద్దరూ అప్పట్లో ఎన్నో షోలకు యాంకరింగ్ చేశారు.

అయితే, చిన్న మనస్పర్థల వలన ఇద్దరి మధ్య కొన్నాళ్ళు గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇద్దరూ జోడి కట్టి యాంకరింగ్ చేస్తున్నారు. అలానే తాజాగా కనబడుట లేదు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇద్దరూ కనబడుట లేదు అనే పదాన్ని బాగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా లాస్య కొన్ని రోజుల్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావట కదా.. ఏదో హౌజ్‌లోకి వెళ్తున్నావట కదా అంటూ కామెంట్ చేసింది. ఇది బిగ్ బాస్ హౌస్ గురించేనని అందరికీ అర్ధమైంది.

అయితే.. దాన్ని రవి కవర్ చేయాలని ప్రయత్నించాడు. నేను ఏ హౌజ్‌కు వెళ్తా.. నా ఇంటికే వెళ్తా అంటూ రవి సమాధానమిచ్చాడు. దానికి లాస్య కూడా అదే అదే అంటూ కవర్ చేసినా.. కానీ అప్పటికే లాస్య కామెంట్స్ బిగ్ బాస్ గురించేనని ఓపెన్ అయిపొయింది. అయితే.. ఎవరు ఎన్ని ఓపెన్ చేసినా బిగ్ బాస్ నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఎవరో ఆ గ్లాస్ హౌస్ లోకి వెళ్తారన్నది కన్ఫర్మ్ కాదు.