Bubblegum Teaser : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌లాక్‌తో..

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల నటిస్తున్న 'బబుల్ గమ్' టీజర్ ని నాని రిలీజ్ చేశాడు. ఇక టీజర్ లో నువ్వు పళ్ళు తోముకోపోయినా వచ్చి ముద్దు పెడతా అంటూ..

Bubblegum Teaser : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌లాక్‌తో..

Anchor Suma Bubblegum Teaser released by Hero Nani

Updated On : October 10, 2023 / 2:05 PM IST

Bubblegum Teaser : టాలీవుడ్ యాంకర్ సుమ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగిన అక్కడ సుమ ఉండాల్సిందే. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల.. టాలీవుడ్ చిన్న, పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు వీరి వారసుడు.. ‘రోషన్’ హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో ‘నిర్మల కాన్వెంట్’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసిన రోషన్.. ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే మూవీతో హీరోగా డెబ్యూట్ ఇస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ రాజమౌళి లాంచ్ చేశాడు.

తాజాగా ఈ మూవీ టీజర్ ని నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. మొదటి సినిమాలోనే రోషన్ హీరోయిన్ కి ఘాటు లిప్‌లాక్‌ కి ఇచ్చేశాడు. టీజర్ చూస్తుంటే.. ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతుంది అర్ధమవుతుంది. ఒక రిచ్ గర్ల్ అండ్ పూర్ బాయ్ మధ్య సాగే లవ్ స్టోరీని కొత్తగా చూపించబోతున్నారు. తెలంగాణ స్లాంగ్ లో రోషన్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘నిన్ను డ్రాప్ చేస్తా, పికప్ చేస్తా, నువ్వు పళ్ళు తోముకోపోయినా వచ్చి ముద్దు పెడతా’ అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది.

Also read : Prabhas : ఆయన విగ్రహం చూసి షాక్ అయిన ప్రభాస్.. ఎవరిది ఆ విగ్రహం..?

కాగా ఈ మూవీని రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు.. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఈ మూవీ పై మంచి బజే క్రియేట్ అయ్యింది. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తుంది. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.