Big boss 5: బిగ్ బాస్ ఇంట్లోకి వర్షిణి.. ఇది ఫైనల్!
ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారన్నదానిపై షో యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ.. స్పెక్యులేషన్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లోగో విడుదల కాగా ఆదివారం నాడు ప్రోమో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేసిన నిర్వాహకులు ఇప్పటికే కొందరికి సంబంధించి ఏవీలు కూడా షూట్ చేసేశారు.

Big Boss 5
Big boss 5: ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారన్నదానిపై షో యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ.. స్పెక్యులేషన్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లోగో విడుదల కాగా ఆదివారం నాడు ప్రోమో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేసిన నిర్వాహకులు ఇప్పటికే కొందరికి సంబంధించి ఏవీలు కూడా షూట్ చేసేశారు. ఒకటి రెండు రోజులలో మిగతా కంటెస్టెంట్ల ఏవీల షూట్ కూడా పూర్తిచేసి ఈనెల 20 నుండి అందరినీ క్వారంటైన్ కి పంపనున్నారు.
సెప్టెంబర్ నుండి మొదలు కానున్న ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా వెళ్లేవారు వీరేనని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యాంకర్ రవి, వర్షిణి, లోబో, నటి ప్రియా, యూట్యూబర్ షణ్ముఖ్, నటి సురేఖా వాణీ, టీవీ 9 యాంకర్ ప్రత్యుషలతో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో కొందరి ఏవీలు కూడా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. అందులో యాంకర్ వర్షిణి కూడా ఉందట. దీంతో యాంకర్ వర్షిణి హౌస్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది.
వర్షిణి ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని ప్రచారం బలంగానే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన కామెడీ స్టార్స్ షోలో వర్షిణి కనిపించకుండా మాయమై హఠాత్తుగా శ్రీముఖి ప్రత్యక్షమయ్యారు. ఇక మొదటి రోజు శ్రీముఖి చేసిన కామెంట్లను బట్టి చూస్తే కూడా వర్షిణి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టబోతుందని స్పష్ఠంగా తెలుస్తోంది. అయితే.. అధికారికంగా షో మొదలయ్యే రోజు వరకు షో యాజమాన్యం ఎక్కడా ఇది రిలీవ్ చేయదు కనుక అప్పటివరకు ఇది సస్పెన్స్ గానే ఉండనుంది.