ఎట్టకేలకు బాలయ్యని ఒప్పించాడు..

వరుస విజయాలతో జోరు మీదున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి, నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య కోసం గతంలో ‘రామారావుగారు’ అనే టైటిల్‌తో సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాడు. అయితే బాలయ్యకు ఆ కథ నచ్చకపోవడం వల్లో, డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్లో అప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కలేదు.
తాజాగా మరోసారి బాలయ్యను అనిల్ కలిసినట్టు సమాచారం. బాలయ్య బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే విధంగా అనిల్ ఓ టెర్రిఫిక్ కథను సిద్ధం చేశాడట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలయ్య ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. బాలయ్య చేతిలో ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ఉంది. వచ్చే ఏడాది అనిల్ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.