Animal Movie : ఎక్కువ నిడివితో ఓటీటీలోకి యానిమల్ మూవీ.. అప్పుడే రిలీజ్ అయ్యేది..
బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ ని నమోదు చేసిన యానిమల్.. ఓటీటీలోకి 8 నిమిషాల అదనపు సన్నివేశాలతో రాబోతుందట.

Animal Movie come with eight minutes additional run time to ott
Animal Movie : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపిస్తూ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన సినిమా ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ.. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ ని నమోదు చేస్తూ ఇంకా ముందుకు సాగుతూనే వెళ్తుంది.
ఇక ఆల్రెడీ థియేటర్స్ లో చూసేసిన ఆడియన్స్.. ఓటీటీలోకి మళ్ళీ వస్తే చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో అని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. అయితే ఓటీటీలోకి 8 నిమిషాల అదనపు సన్నివేశాలతో తీసుకు వస్తారట.
Also read : Shruti Haasan : ఐరన్ లెగ్ నుంచి లక్కీ హీరోయిన్.. ప్లాప్‌ల్లో ఉన్న హీరోకి సక్సెస్..
ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ వంగ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేశారు. థియేటర్ లోకి ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో మరో 8 నిమిషాలు జతచేసుకొని 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుంది. మరి ఈ ఎనిమిది నిమిషాల్లో ఎటువంటి సన్నివేశాలు ఉండబోతున్నాయో అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్నా ఈ చిత్రాన్ని జనవరిలో ఓటీటీకి తీసుకు రానున్నారట. 2024 జనవరి 26న ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. అయితే మూవీ టీం నుంచి గాని, నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి గాని ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకు 860 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఓవర్ సీస్ లో కూడా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతుంది. నార్త్ అమెరికాలో హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ లిస్టులో ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. మరి ఓవర్ ఆల్‌గా ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.