కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..! ఆ అవార్డు రద్దు..
అవార్డ్ అందుకునేందుకు జానీకి ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు.

Jani Master (Photo Credit : Google)
Jani Master : మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ రద్దు చేసింది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ ఈ మేరకు అవార్డును రద్దు చేస్తూ డెసిషన్ తీసుకుంది. కాగా, నేషనల్ అవార్డుకు ఎంపికైన కొన్ని రోజులకే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడం, ఆయన అరెస్ట్ అవడం అన్నీ జరిగిపోయాయి. అవార్డ్ అందుకునేందుకు జానీకి ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు.
Also Read : మెగా హౌస్.. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా విలాసవంతమైన భవనం!
2022 సంవత్సరానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ చలన చిత్ర అవార్డుకు జానీ ఎంపికయ్యాడు. తిరు సినిమాలోని మేఘం కరిగెను పాటకు జానీ మాస్టర్ ను సెలెక్ట్ చేసింది కమిటీ. అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అయితే, ప్రస్తుతం అవార్డు రద్దు కావడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.