Bigg Boss Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి హీరోయిన్గా మరో ప్రొజెక్ట్
దివి.. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఈ అమ్మడి సుడి తిరిగినట్టు ఉంది. సీజన్ 4లో పాల్గొన్న దివి తన అందచందాలతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే
Bigg Boss Divi : దివి.. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఈ అమ్మడి సుడి తిరిగినట్టు ఉంది. సీజన్ 4లో పాల్గొన్న దివి తన అందచందాలతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో నిజంగానే అందాల దీవి అనిపించింది. మోడలింగ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ ‘మహర్షి’ సినిమాలో మెరిసింది. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ.. ఆమెకు ఇప్పటివరకూ సరైన అవకాశాలు లభించలేదు. అయితే బిగ్‌బాస్ షో తర్వాత మాత్రం ఈ భామకు విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది.
ఇటీవలే క్యాబ్ స్టోరీస్‌తో హీరోయిన్గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌కు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారట. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కళ్యాణ్ స్నేహితుడు నవీన్ గాంధీ దీనికి దర్శకత్వం చేయనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం బంగార్రాజు పనులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా, దివి అందాలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్లాట్ అయి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇక సోషల్ మీడియాలో దివి మాములుగా హంగామా చేయదు. తరచూ ఫోటో షూట్లు చేస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంటుంది. గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉండంతో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు త్వరలోనే వైరల్ అవుతుంటాయి.