Maruthi-Sai Durga Tej: మారుతి కథ.. సాయి దుర్గ తేజ హీరో.. మెగా ప్రాజెక్ట్ లాక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ(Maruthi-Sai Durga Tej) మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Another movie in the Sai Durga Tej and Maruthi combo
Maruthi-Sai Durga Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటిగ్ దశలో ఉంది. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్(Maruthi-Sai Durga Tej) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్
అయితే, ఈ సినిమాకు వీడియోకి ముందే మరో భారీ సినిమాను మొదలుపెట్తాస్తున్నాడు. మిరాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి కథను అందించనున్నారు. రాజా సాబ్ లానే ఈ కథ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని టాక్. డార్లింగ్ స్వామీ మాటలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇక సాయి దుర్గ తేజ-మారుతి కాంబోలో ఇప్పటికే ప్రతీరోజు పండగే సినిమా చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాదించింది ఈ సినిమా. దాంతో, మారుతీ-సాయి దుర్గ తేజ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ ఉండనున్నాయి. మరి ఈ సినిమా ఆ మ్యాజిక్ ను క్రియేట్ అవుతుందా చూడాలి.