ఏఎన్నార్ అవార్డులు : చిరంజీవి ఇంకా 15 ఏళ్లు హీరోగా ఉంటాడు

  • Published By: madhu ,Published On : November 17, 2019 / 01:16 PM IST
ఏఎన్నార్ అవార్డులు : చిరంజీవి ఇంకా 15 ఏళ్లు హీరోగా ఉంటాడు

Updated On : November 17, 2019 / 1:16 PM IST

ఏఎన్నార్ మహోన్నత వ్యక్తి..మళ్లీ అలాంటి వ్యక్తి ఎప్పుడు పుడుతాడో..ఇంకా 15 సంవత్సరాల పాటు హీరోగా నటించే సత్తా మెగాస్టార్ చిరంజీవిలో ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారేవత్త, రాజకీయ వేత్త టి.సుబ్బిరామిరెడ్డి. తండ్రి కోరికను నిర్వహిస్తున్న నాగార్జునను అభినందినిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన మాటను నిలుపుతున్నారని తెలిపారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడారు. ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని తరతరాలుగా చేయాలని అక్కినేని అనుకున్నారని, గతంలోనే శ్రీదేవీ, రేఖలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నమన్నారు. కానీ అంతలోనే అక్కినేని అనంతలోకాలకు వెళ్లారని తెలిపారు. తర్వాత అవార్డుల ప్రధానోత్సవం కొంతకాలం ఆలస్యమైందన్నారు. 

దేవలోకానికి వెళ్లిన దేవత నటి శ్రీదేవి అని, హృదయ సౌందర్యం గలదన్నారు. ఆమె మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆమె మరణానంతరం భర్త బోనీకపూర్ భాధను అణుచుకుని వెళుతున్నారన్నారు. 

ఇక రేఖ విషయానికి వస్తే..అదే..అందం..అభినయం అన్నారు. తెలుగు అమ్మాయిగా ఉండి..జాతీయస్థాయిలో గొప్పగా నటించిన రేఖకు ఏఎన్నార్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. 

ఎలాంటి రోల్‌నైనా ఇట్టే చేయగల నటుడు మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. హీరోగా నటించే సత్తా ఆయనలో ఉందన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవానికి వచ్చిన వారందరికీ టి.సుబ్బిరామిరెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. 
Read More : ఏఎన్ఆర్ అవార్డుల వేడుక: హాజరైన టాప్ సెలబ్రిటీలు