Guppedantha Manasu : మహేంద్ర, అనుపమ రిలేషన్ ఏంటి?.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఆసక్తి రేపుతున్న కొత్త క్యారెక్టర్
జగతి గురించి ఆలోచిస్తూ ఫుల్లుగా తాగి అరకు తోటల్లో తిరుగుతున్న మహేంద్రకు అనుపమ కనిపిస్తుంది. ఆమెను చూసి షాకవుతాడు. అనుపమ మహేంద్ర పరిస్థితి చూసి ఆవేదన చెందుతుంది. అసలు ఈ అనుపమ ఎవరు? జగతి, మహేంద్ర, అనుపమల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి?

Guppedantha Manasu
Guppedantha Manasu : అరకులో వసుధర, రిషి, మహేంద్ర రిలాక్స్ అవుతుంటారు. మహేంద్రకు అనుపమ కనిపిస్తుంది. ఒకరిని చూసి ఒకరు షాకవుతారు. అనుపమ జగతి గురించి అడుగుతుంది. అసలు అనుపమ ఎవరు? జగతి, మహేంద్ర, అనుపమల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి?
Guppedantha Manasu : హనీమూన్‌లో మరింత దగ్గరైన రిషి, వసుధర.. వాళ్లెక్కడ ఉన్నారో శైలేంద్రకు తెలిసిపోయిందా?
ఫుల్లుగా తాగి ఉన్న మహేంద్రని చూసి అనుపమ షాకవుతుంది. జగతి గురించి అడుగుతుంది. మహేంద్ర తాను ఇప్పుడు ఏది చెప్పే పరిస్థితుల్లో లేనంటాడు. అయినా జగతి గురించి చెప్పాల్సిందే అని పట్టుబడుతుంది. ఈసారి కలిసినపుడు చెబుతానని అంటాడు మహేంద్ర. సరే అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. తండ్రిని వెతుకుతూ వచ్చిన రిషి, వసుధర అనుపమ వెళ్తుండటం చూసి ఎవరని అడుగుతారు. ఎవరో అడ్రస్ అడుగుతున్నారని మాట దాటేస్తాడు మహేంద్ర. వసుధరకి అక్కడ చెట్టుపై జగతి, మహేంద్ర, అనుపమ అని రాసి ఉండటం చూసి అనుమానం వస్తుంది. ఎవరీ అనుపమ అని ఆలోచిస్తుంది.
ఇంటికి వచ్చిన అనుపమ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది. తనకు మహేంద్ర కనిపించాడు అని చెబుతుంది. జగతి కూడా కనిపించిందా? అని ఆమె పెద్దమ్మ అడుగుతుంది. లేదని మహేంద్ర ఒంటరిగా కనిపించాడని చెబుతుంది. నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం చెప్పాల్సి వస్తే ఇప్పటికైనా మహేంద్ర, జగతికి చెబుతావా? అంటుంది ఆమె పెద్దమ్మ. వాళ్లిద్దరు తన బెస్ట్ ఫ్రెండ్స్ అని జగతి తన ప్రాణం అని చెబుతుంది అనుపమ. మహేంద్రతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది అనుపమ ..మహేంద్ర ఫోన్ ఎత్తగానే కట్ చేస్తుంది. ఫోన్ చేసి పెట్టేసింది అనుపమయే అని గ్రహిస్తాడు మహేంద్ర.
Guppedantha Manasu : హనీమూన్‌కి వెళ్లిన రిషి, వసుధర.. మహేంద్రను కలసిన కొత్త క్యారెక్టర్ ఎవరు?
తండ్రి అరకు వచ్చినా తాగుడు మానకపోవడంపై రిషి ఆందోళన చెందుతాడు. ఈలోపు ఎస్ఐ నుంచి రిషికి ఫోన్ వస్తుంది. జగతిని చంపిన కిల్లర్ ఎవరో ఇంకా దొరకలేదని.. ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడని చెబుతాడు. అన్ని కోణాల్లో ఇన్విస్టిగేట్ చేయమని అతడిని కోరతాడు రిషి. రిషికి శైలేంద్ర, దేవయానిలే అసలు శత్రువులని చెప్పేసినట్లు ఊహిస్తుంది వసుధర. వాళ్ల గురించి తప్పుగా మాట్లాడొద్దు అని రిషి ఆమె చెంప మీద కొట్టినట్లు ఫీలవుతుంది. డైరెక్ట్ గా రిషికి వాళ్లే శత్రువులు అని చెప్పేస్తే ఎదురయ్యే పరిణామం ఇదే అని భావిస్తుంది వసుధర.
దేవయాని, శైలేంద్ర రిషి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని సతమతమైపోతుంటారు. చివరికి శైలేంద్ర భార్య ధరణిని పిలిచి ఆమె ఫోన్ తీసుకుని ధరణి చాట్ చేస్తున్నట్లు వసుధరతో చాట్ చేస్తాడు. చాట్ చేస్తున్నది శైలేంద్ర అయి ఉంటాడని గ్రహించిన వసుధర తామెక్కడున్నది చెప్పకుండా ఒక ఫోటో పెడుతుంది. ఇక శైలేంద్ర ఆ ఫోటో ద్వారా రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని కిల్లర్‌తో అటాక్‌కి ప్లాన్ చేస్తాడు. ఓవైపు మహేంద్రని కలవడానికి అనుపమ బయలుదేరుతుంది. తండ్రి తాగిన మైకంలో అనుపమ అనే పేరు పలకడంతో డౌట్ వచ్చి ఆ అనుపమ ఎవరో తెలుసుకోవాలని రిసార్ట్ నుంచి రిషి బయలుదేరతాడు. మహేంద్రకి రిషి ఖచ్చితంగా అనుపమని కలుస్తాడని డౌట్ వస్తుంది.
రోడ్డుపై నడిచి వెళ్తున్న రిషిని కారుతో ఢీకొట్టబోతాడు కిల్లర్. రెప్పపాటులో అతడిని పక్కకు లాగుతుంది అనుపమ. రిషి థ్యాంక్స్ చెప్పి వెళ్లబోతుంటే లిఫ్ట్ ఇస్తా రమ్మంటుంది. వాళ్లుండే రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. రిషిని, అనుపమని చూసిన మహేంద్ర షాకవుతాడు. అనుపమ రిషికి అన్ని విషయాలు చెప్పేసిందని అనుకుంటాడు. అసలు ఈ అనుపమ ఎవరు? మహేంద్ర గతం ఏంటి? రిషి మీదకు ఎటాక్ చేయించింది శైలేంద్రేనా? ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో తర్వాత ఏమైందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.