Anushka Shetty : ఓర్నీ.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన అనుష్క ఫ్లాప్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో..?

ఘాటీ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. (Anushka Shetty)

Anushka Shetty  : ఓర్నీ.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన అనుష్క ఫ్లాప్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో..?

Anushka Shetty

Updated On : September 26, 2025 / 10:40 AM IST

Anushka Shetty : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవల అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా తెరకెక్కిన సినిమా ‘ఘాటీ’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజయింది. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.(Anushka Shetty)

ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా మిగిలింది. గంజాయి చుట్టూ కథ నడపడం, చివర్లో గంజాయి తాగొద్దు అని మెసేజ్ ఇవ్వడం లాంటి కథతో మంచి విజువల్స్ ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమాతో అనుష్క ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడ్డారు. మూవీ యూనిట్ కొండలు, కోనల్లో సినిమా కోసం కష్టపడినా ఫలితం రాలేదు. అయితే ఘాటీ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం.

Also Read : Sujeeth : OG సూపర్ హిట్ అయింది.. మరి సుజీత్ నెక్స్ట్ సినిమాలేంటి..? నానితో సినిమా సంగతేంటి..?

ఘాటీ సినిమా నేడు సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఘాటీ స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వర్షన్ లేకపోవడం గమనార్హం. థియేటర్స్ లో రిలీజయిన మూడు వారాలకే అనుష్క లాంటి స్టార్ సినిమా ఓటీటీలోకి రావడం చర్చగా మరింది.