Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్ 

ఆస్కార్ అవార్డుల గ్రహీత, సంగీత స్వర మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేశారు.  

  • Published By: sreehari ,Published On : April 2, 2019 / 07:32 AM IST
Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్ 

Updated On : April 2, 2019 / 7:32 AM IST

ఆస్కార్ అవార్డుల గ్రహీత, సంగీత స్వర మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేశారు.  

ఆస్కార్ అవార్డుల గ్రహీత, సంగీత స్వర మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేశారు.  ఆంటోని రుస్సో, జో రుస్సోల డైరెక్షన్ లో రూపొందిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’కొత్త మూవీ ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది.
Read Also : శివ – సూర్య కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్

ఈ సినిమా రిలీజ్ కు ముందే మార్వెల్ ఇండియన్ ఫ్యాన్స్ కోసం రెహమాన్ ముంబైలో జరిగిన ఓ ప్రొగ్రామ్ లో ఈ పాటను విడుదల చేశారు. మార్వెల్ స్టూడియోస్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో మార్వెల్ గీతాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేసింది. ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఒక్కో భాషలో ఒక్కోల్లా ఈ పాటకు రెస్పాన్స్ వస్తోంది. 

తెలుగు భాషలో రిలీజ్ అయిన అవెంజర్స్ : ఎండ్ గేమ్ టైటల్ సాంగ్ పై అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. హిందీలో ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తోంది. రోకో నా రూకింగే అబ్ తో యారా అనే సాగే ఈ పాటకు ఇండియన్ ఫ్యాన్స్ ను మెప్పించడంలో రెహమాన్ ఫెయిల్ అయ్యాడని.. చెత్త సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు తమ హింది వెర్షన్ సాంగ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమిళ్ ఫ్యాన్స్ కూడా మార్వెల్ స్టూడియోస్ తమిళ భాషలో  మార్వెల్ టైటిల్ సాంగ్ ఇంకా రిలీజ్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఇంటర్నెట్ యూజర్లు మాత్రం.. ఏప్రిల్ 1 న మార్వెల్ సాంగ్ రిలీజ్ కావడం ఏప్రిల్ ఫూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష