Prema : చాలా సార్లు పాములతో కలిసి నటించా.. నా మెడలో పాము చూసి సాయి కుమార్ గారు..
దేవి సినిమాతో బాగా పాపులర్ అయిన ఒకప్పటి హీరోయిన్ ప్రేమ తెలుగు, తమిళ్, కన్నడ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో.........

Artist Prema Shares her movie experiences
Prema : దేవి సినిమాతో బాగా పాపులర్ అయిన ఒకప్పటి హీరోయిన్ ప్రేమ తెలుగు, తమిళ్, కన్నడ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది. గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ప్రేమ తాజాగా అనుకోని ప్రయాణం అనే సినిమాతో మళ్ళీ తెలుగులో కనిపించబోతుంది.
రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు ముఖ్య పాత్రల్లో అనుకోని ప్రయాణం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ప్రేమ అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది. ఒకప్పటి తన సినిమాల గురించి మాట్లాడింది.
దేవి, నాగదేవత ఇలా ఎక్కువగా పాముల మీద, దేవతగా కనపడే సినిమాలు చేసావు అని అలీ అడగడంతో.. ”దేవతలా కనపడటం నాకిష్టం. ప్రేక్షకులు మనల్ని చూసి నిజంగా దేవతలు అనుకోవాలి. దేవతలా నటించాలంటే కూడా చాలా కష్టం. అలాంటి పాత్రలు చేసేటప్పుడు అసలు ఎవరితో మాట్లాడను. దేవి సినిమా చేసేటప్పుడు దేవతలా ఫీల్ అయి చేశా, చాలా బాగా వచ్చింది” అని తెలిపింది ప్రేమ.
ఇక పాముల గురించి మాట్లాడుతూ.. ”చాలా సార్లు పాములతో కలిసి నటించాను. నాగదేవత సినిమాలో నా మెడలో పాము వేసి రొమాంటిక్ గా నటించామన్నారు, ఎదురుగా సాయి కుమార్ గారు ఉన్నారు. నాకు చాలా భయమేసింది. నేను సీన్ చేస్తున్నంతసేపు సాయికుమార్ గారు నవ్వు ఆపుకుంటూ ఉన్నారు. అయిపోయాక నిన్ను ఇలా చూడలేను మెడలో పాముతో అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు సాయి కుమార్ గారు” అని తెలిపింది.