Aryan Khan : బెయిల్‌ షరతులను మార్చాలంటూ కోర్టుని ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో నిన్న శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. ప్రతి శుక్రవారం ఉదయం.......

Aryan Khan : బెయిల్‌ షరతులను మార్చాలంటూ కోర్టుని ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్

Aryan

Updated On : December 11, 2021 / 7:18 AM IST

Aryan Khan :  ఇటీవల బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌ను రెండు నెలల క్రితం ఎన్సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి కొన్ని రోజులు జైలులో ఉంచారు. కోర్టు, స్పెషల్ కోర్టులలో అనేక వాదనల తర్వాత బాంబే హైకోర్టు ఆర్యన్ కు 14 షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

Kamya Panjab : విడాకులు తీసుకుంటే చనిపోవాలా? : ఘాటు రిప్లై ఇచ్చిన నటి

ఈ షరతుల్లో ఆర్యన్ ఖాన్ దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు హాజరయి సంతకం చేయడం కూడా ఒకటి. అయితే దీనిపై ఆర్యన్ ఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో నిన్న శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాడు.

NTR : మా అమ్మది కర్ణాటకే : ఎన్టీఆర్

ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డ్రగ్స్ కేసును ప్రత్యేక విచారణ బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతును సవరించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు ఆర్యన్. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది.