Asian Cinemas : మల్టీప్లెక్స్‌గా సుదర్శన్ RTC-X థియేటర్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఫస్ట్ డ్రైవ్ ఇన్ థియేటర్..
హైదరాబాద్ సరికొత్త సినిమా థియేటర్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డ్రైవ్ ఇన్ థియేటర్. డ్రైవ్ ఇన్ థియేటర్ అంటే కారులో కూర్చొని ఓపెన్ స్పేస్ లో..

Asian Cinemas Sunil announce his next ventures in hyderabad and chennai
Asian Cinemas : భారతదేశంలో మల్టీప్లెక్స్ కల్చర్ కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతుంది. ఇక ఈ మల్టీప్లెక్స్ చైన్ లో ఆసియన్ సినిమాస్ (Asian Cinemas) శరవేగంగా ఎదుగుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి AMB సినిమాస్ ని మొదలుపెట్టిన ఈ సంస్థ.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో (Allu Arjun) కలిసి AAA సినిమాస్ ని ప్రారభించారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ స్థానంలో ‘ఆసియన్ అల్లు సత్యం థియేటర్’ పేరుతో మరో మల్టీప్లెక్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగా.. చరణ్ రియాక్షన్ మీరు ఉహించి ఉండరు.. అదేంటో తెలుసా?
ఇక ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ లో ఆసియన్ సినిమాస్ ప్రతినిధి ఆసియన్ సునీల్ మాట్లాడుతూ.. తమ తదుపరి వెంచర్స్ గురించి తెలియజేశాడు. తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ (Sivakarthikeyan) తో కలిసి చెన్నైలో ఒక మల్టీప్లెక్స్ ని ప్రారభించబోతున్నారు. త్వరలోనే ఈ థియేటర్ ఓపెనింగ్ కూడా జరగనుందట. అలాగే హైదరాబాద్ లోని పలు వెంచర్స్ గురించి కూడా తెలియజేశారు. హైదరాబాద్ RTC-X రోడ్స్ దగ్గర ఉన్న సుదర్శన్ 70MM థియేటర్ ని మల్టీప్లెక్స్ గా చేయబోతున్నట్లు తెలియజేశారు.
దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డ్రైవ్ ఇన్ థియేటర్ (Drive in Theater) ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. డ్రైవ్ ఇన్ థియేటర్ అంటే కారులో కూర్చొని ఓపెన్ స్పేస్ లో సినిమా చూడడం. ఇటువంటి థియేటర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఇక ఇప్పుడు ఆసియన్ సునీల్ ప్రకటనతో మూవీ లవర్స్ లో ఆసక్తి మొదలైంది. ఇక ఈ థియేటర్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. 2 ఎకరాల ల్యాండ్ ని కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.