Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు షారుఖ్ ఖాన్‌కి చూపించాను.. అట్లీ కామెంట్స్

తమిళ దర్శకుడు అట్లీ.. అల్లు అర్జున్ సినిమాలను షారుఖ్ ఖాన్‌కి చూపించాడట.

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు షారుఖ్ ఖాన్‌కి చూపించాను.. అట్లీ కామెంట్స్

Atlee show Allu Arjun films to Shah Rukh Khan during jawan shooting time

Updated On : September 22, 2023 / 1:27 PM IST

Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కి భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టింది. నేషనల్ వైడ్ ఇప్పుడు బన్నీ అంటే తెలియని వారు లేరు. తన సినిమాల కోసం పాన్ ఇండియా వైడ్ ఎదురు చూస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా అల్లు అర్జున్ ని అభిమానిస్తుంటారు. తాజాగా తమిళ దర్శకుడు అట్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్ కి వీరాభిమాని అంటూ చెప్పుకొచ్చాడు. ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ సినిమాలు తనకెంతో ఇష్టమని వెల్లడించాడు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది.. కన్నడ స్టార్ హీరో కామెంట్స్..

ఇక ఈ అభిమానంతో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కి కూడా ఈ సినిమాలు చూపించాడట. రీసెంట్ ఈ దర్శకుడు షారుఖ్ తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే షారుఖ్ కి అల్లు అర్జున్ సినిమాలు చూపించాడట. ఆ చిత్రాలు షారుఖ్ కి కూడా బాగా నచ్చాయట. కాగా అట్లీ ఇటీవల అల్లు అర్జున్ కి ఒక కథ వినిపించాడట. ప్రస్తుతం ఆ మూవీకి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. అంతా ఒకే అయితే త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చే అవకాశం ఉంది.

Leo Movie : క్యాప్షన్స్‌తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..

అల్లు అర్జున్ ప్రెజెంట్ పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు సాగనుందని సమాచారం. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్, సందీప్ వంగ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో త్రివిక్రమ్ సినిమా ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే.. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో వీరి తదుపరి కలయిక పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.