Abhishek Bachchan : తన కొడుకుని టాలెంటెడ్ యాక్టర్ అనుకుంటున్నాడు అబితాబ్ బచ్చన్.. రచయిత సంచలన కామెంట్స్!

బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కొన్ని దశాబ్దాల కాలం నుంచి భారతీయ సినీ పరిశ్రమని ఏలుతూ వస్తున్నాడు. ఇక అమితాబ్ వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన అభిషేక్ బచ్చన్ కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ రాణిస్తున్నాడు. కాగా ముంబైకి చెందిన ఒక పేరున్న రచయిత తస్లిమా నస్రీన్, అభిషేక్ బచ్చన్ పై తీవ్ర విమర్శలు చేసింది.

Abhishek Bachchan : తన కొడుకుని టాలెంటెడ్ యాక్టర్ అనుకుంటున్నాడు అబితాబ్ బచ్చన్.. రచయిత సంచలన కామెంట్స్!

Author Taslima Nasreen criticized Abhishek Bachchan

Updated On : December 23, 2022 / 7:44 AM IST

Abhishek Bachchan : బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కొన్ని దశాబ్దాల కాలం నుంచి భారతీయ సినీ పరిశ్రమని ఏలుతూ వస్తున్నాడు. 80 ఏళ్ళ వయసులో కూడా విశ్రాంతి లేకుండా వరుస సినిమాల్లో, టెలివిజన్ షోలో నటిస్తూ ఇప్పటి హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇక అమితాబ్ వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన అభిషేక్ బచ్చన్ కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ రాణిస్తున్నాడు.

Amitabh Bachchan : తన ఇమేజ్‌ని వాడుకుంటున్నారు అంటూ.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్..

కాగా ముంబైకి చెందిన ఒక పేరున్న రచయిత తస్లిమా నస్రీన్, అభిషేక్ బచ్చన్ పై తీవ్ర విమర్శలు చేసింది. “అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్ ని చాలా అమితంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకు తన టాలెంట్స్ అన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు అని భ్రమ పడుతున్నాడు. అభిషేక్ మంచి నటుడు అయ్యి ఉండవచ్చు, కానీ అమితాబ్ అంత టాలెంటెడ్ యాక్టర్ అయితే కాదు” అంటూ ట్వీట్ చేసింది.

దీనికి అభిషేక్ బచ్చన్ బదులిస్తూ.. “కచ్చితంగా అది నిజం మేడమ్. అయన నటన, టాలెంట్ విషయంలో అయన దరిదాపుల్లోకి ఎవరు చేరుకోలేరు. అయన ఎప్పటికి ఒక గొప్ప ప్రతిభాశాలిగా నిలిచిపోతాడు. అయన కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను” అంటూ సౌమ్యంగా ట్వీట్ చేశాడు. కాగా తస్లిమా నస్రీన్.. ఆమె చేసిన ట్వీట్ ని కొంతసేపటికి డెలీట్ చేయడం విశేషం.